logo

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Published : 26 Nov 2022 02:13 IST

సన్యాసినాయుడును పార్టీలోకి ఆహ్వానిస్తున్న నాదెండ్ల

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గంట్యాడలో శుక్రవారం కురుపాం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనుగులు, తోటపల్లి, జంఝావతి జలాశయాల నిర్మాణాలతో గ్రామీణులు ఎంతో నష్టపోయారని, జనసైనికులు వీటిపై అవగాహన పెంచుకుని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గంట్యాడ మండలం రామవరానికి చెందిన విద్యావేత్త, ఎంఎస్‌ఎన్‌ విద్యాసంస్థల అధినేత ఎం.సన్యాసినాయుడు, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలకు చెందిన పలువురు జనసేనలో చేరారు. వీరికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లాలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి కన్వీనర్‌ శ్రీనివాసరావు ఆయనకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పీఏసీ సభ్యుడు ముత్తా శశిధర్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, గంగులయ్య, కల్యాణం శివ శ్రీనివాస్‌, బాబు పాలూరి, ఆదాడ మోహనరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని