logo

బొగ్గు లారీ దగ్ధం

జాతీయ రహదారిపై ఓ లారీ అగ్నికి ఆహుతైంది. జయశంకర్‌ జిల్లా కాటారం మండలంలోని నస్తూర్‌పల్లి వద్ద మహాదేవపూర్‌ వైపు వెళ్లే రహదారిపై అటవీ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం హోస్పేట నుంచి ఒడిశాకు బొగ్గు, ఇతర రసాయనాలతో వెళ్తున్న లారీకి వెనుక వైపు షార్ట్‌ సర్క్యూటతో మంటలు అంటుకున్నాయి.

Published : 27 Nov 2022 05:21 IST

కాటారం, న్యూస్‌టుడే : జాతీయ రహదారిపై ఓ లారీ అగ్నికి ఆహుతైంది. జయశంకర్‌ జిల్లా కాటారం మండలంలోని నస్తూర్‌పల్లి వద్ద మహాదేవపూర్‌ వైపు వెళ్లే రహదారిపై అటవీ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం హోస్పేట నుంచి ఒడిశాకు బొగ్గు, ఇతర రసాయనాలతో వెళ్తున్న లారీకి వెనుక వైపు షార్ట్‌ సర్క్యూటతో మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ రహదారి పక్కన నిలిపాడు. దట్టమైన మంట, పొగ వ్యాపించడంతో రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను ఆర్పేసింది. అప్పటికే లారీ పూర్తిగా దగ్ధమైంది. రూ.45 లక్షల మేర నష్టం వాటిల్లింది. కాటారం డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి, సీఐ రంజిత్‌రావు, ఎస్సై శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని