logo

విప్‌గా డోర్నకల్‌ ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌

డోర్నకల్‌ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన  డా.జాటోత్‌ రామచంద్రునాయక్‌ ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు.

Published : 16 Dec 2023 04:27 IST

డోర్నకల్‌, న్యూస్‌టుడే: డోర్నకల్‌ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన  డా.జాటోత్‌ రామచంద్రునాయక్‌ ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినవారు మంత్రులుగా పని చేశారు. ప్రభుత్వ విప్‌ హోదా లభించడం ఇదే ప్రథమం.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో డోర్నకల్‌ నుంచి రామచంద్రునాయక్‌ 53,131 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇదే అత్యధిక మెజారిటీ. ఆయన ‘న్యూస్‌టుడే’తో చరవాణిలో మాట్లాడుతూ ప్రభుత్వం తనపై ఉంచిన విప్‌ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తామన్నారు.

ప్రభుత్వ విప్‌ విధులు ఇవి: శాసనసభలో పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉంటారు. అసెంబ్లీలో ఏదైనా కీలక బిల్లు ఆమోదం లేదా చర్చకు వచ్చినప్పుడు సభ్యులందరూ ఆ రోజు సమావేశానికి  హాజరయ్యేలా చూస్తారు. శాసనసభలో ప్రభుత్వ వ్యవహారాలను  పర్యవేక్షిస్తారు.  చట్టసభలో అనైతిక చర్యలకు పాల్పడే వారిని నిరోధించేందుకు వీరికి విప్‌ జారీ చేసే అధికారం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని