logo

హేమాచల క్షేత్రంలో పూజలు

మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్‌శర్మలు స్వాగతం పలికారు. 

Published : 24 Apr 2024 02:52 IST

మల్లూరు(మంగపేట) : మండలంలోని మల్లూరు గుట్టపై శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ములుగు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, అర్చకులు రాఘవాచార్యులు, రాజశేఖర్‌శర్మలు స్వాగతం పలికారు.  స్వామి వారి విశిష్టతను వివరించి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎక్సలేటర్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఈవోకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని