logo

ఫలితాలు మెరుగుపడాలి..!

ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు.

Published : 29 Apr 2024 04:21 IST

నిరాశ పరిచిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు

మానుకోట, న్యూస్‌టుడే: ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 65.14 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 17వ స్థానంలోనే నిలిచింది. గత ఏడాది 18 స్థానంలో ఉంది.  వివిధ గురుకుల జూనియర్‌ కళాశాలల్లోనూ ఫలితాల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా సాధారణ, వృత్తి విద్యా కోర్సులను కలుపుకుని ఉత్తీర్ణత శాతం 57.17 మాత్రమే ఉంది. జిల్లాలోని ఈ కళాశాలల్లో బయ్యారం కళాశాల మాత్రమే అత్యధికంగా 84.52 శాతం ఉత్తీర్ణతను సాధించగా జిల్లా కేంద్రంలో అర్ధ శతాబ్దపు చరిత్ర కలిగిన బాలుర జూనియర్‌ కళాశాల అతి తక్కువగా 28.93 శాతం ఉత్తీర్ణత మాత్రమే ఉండి నిరాశను కలిగిస్తోంది. వివిధ గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లోనూ మొత్తం కళాశాలల ఉత్తీర్ణత శాతం 90 శాతానికి చేరుకోకపోవడంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.

ఆ మూడు భేష్‌

ఏజెన్సీ ప్రాంతంలోని గంగారం కేజీబీవీ, గూడూరు మండలం దామరవంచలోని టీటీడబ్య్లూఆర్‌జేసీ (బాలుర), కురవిలోని టీఎస్‌టీడబ్ల్యూఆర్‌ఎస్‌ బాలికల జూనియర్‌ కళాశాలు మాత్రమే వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.

  • జిల్లాలో వివిధ యాజమాన్యాల్లోని ఇంటర్‌ పరీక్షఫలితాలు కొంత ఊరటను ఇచ్చినవే కాని ఆశించినంతగా లేవు. అన్ని కళాశాలల్లో ఫలితాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతో పాటుగా గురుకుల కళాశాలల్లో కొంతవరకు మెరుగైన మౌలిక సదుపాయాలే ఉన్నాయి. అధ్యాపకుల కొరత కూడా అంతగా లేదు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితర చర్యలు చేపట్టారు. ఈ విషయంలో కారణాలను సరిగా విశ్లేషించి అందుకు అనుగుణంగా చర్యలను చేపట్టాలి.
  • ఈ విషయమై జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి సమ్మెట సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరంలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తామన్నారు. కళాశాలల వారీగా సమీక్ష నిర్వహించి ప్రథమ సంవత్సర ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుని  ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతాం.

బీసీ సంక్షేమ కళాశాలలు 79.49
కేజీబీవీలు 82.69
ఆదర్శ కళాశాలు 71.87
సాంఘిక సంక్షేమ
కళాశాలలు 78.01
టీఎంఆర్‌జేసీ 88.52
గిరిజనసంక్షేమ 84.02
ప్రైవేట్ అన్‌ఎయిడెడ్‌
కళాశాలలు 38.44

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని