logo

బాలలతో పని చేయించడం నేరం

14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని  సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి సి.సురేష్‌ అన్నారు. మే డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో న్యాయమూర్తి మాట్లాడారు.

Published : 02 May 2024 06:05 IST

సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్‌  సివిల్‌ న్యాయమూర్తి సి.సురేష్‌

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని  సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి సి.సురేష్‌ అన్నారు. మే డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో బుధవారం నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో న్యాయమూర్తి మాట్లాడారు. పిల్లలు పాఠశాలల్లో ఉండాలని అలా చేసినప్పుడే కార్మిక చట్ట ప్రయోజనాలను కాపాడిన వారమవుతామన్నారు.  ప్రతి ఒక్కరూ ఈ సూచన పాటించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రమాదకర పనుల్లో పనిచేసే కార్మికులకు యాజమాన్యం అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందన్నారు. పట్టణ ఎస్సై సీహెచ్‌.అరుణ, కోర్టు లైజనింగ్‌ అధికారి సంపత్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఎస్సై శ్యాంసుందర్‌, భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు శంకర్‌, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని