వైకాపా ప్రభుత్వ తీరుతో గిరిజనులకు తీరని అన్యాయం
గిరిజనులకు వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర గిరిజన సమాఖ్య (ఆర్‌జీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కోనేటి దివాకర్ అన్నారు
అంబేడ్కర్ కూడలిలో నిరసన తెలుపుతున్న రాష్ట్ర గిరిజన సమాఖ్య నాయకులు
మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : గిరిజనులకు వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర గిరిజన సమాఖ్య (ఆర్‌జీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కోనేటి దివాకర్ అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆర్జీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గిరిజనులు నిరసన కార్యక్రమం చేశారు. ముందుగా విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దివాకర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 40 లక్షల జనాభా కలిగిన గిరిజనులు నేటికీ అవిద్య, అనారోగ్యంతో దయనీయమైన జీవితం గడుపుతున్నారని అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి, అన్యాయం చేయడం తగదన్నారు. గిరిజనులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకపడ్డారని వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చినట్లైతే గిరిజనుల జీవన విధానానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వాల్మీకులు నేడు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెంది వారికంటూ సముచిత స్థానాన్ని కలిగి ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు లేవనెత్తుతామన్నారు. వైకాపా ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. నిరసన కార్యక్రమంలో కొండ్రెడ్డి, శేఖర్ కిల్లా, రెడ్డిశేఖర్, నరేంద్ర, కె.గంగులప్ప, దేవేంద్ర, చంద్ర, రామచంద్ర, కిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?
-
India News
Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న