logo

పెద్దిరెడ్డి కాళ్ల కింద పీలేరు ఆత్మగౌరవం!

పీలేరు ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ల కింద పెట్టారని, ఆయన చేతిలో కీలుబొమ్మగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 24 Apr 2024 03:40 IST

ఆయన చేతిలో ఎమ్మెల్యే చింతల ఓ కీలుబొమ్మ
తెదేపా అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి విమర్శ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లపై పడుతున్న పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

పీలేరు గ్రామీణ, గుర్రంకొండ, కలకడ, న్యూస్‌టుడే : పీలేరు ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్ల కింద పెట్టారని, ఆయన చేతిలో కీలుబొమ్మగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, తెదేపా పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కలకడ, గుర్రంకొండ, పీలేరు ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. కలకడ మండలం గంగాపురం, కె.దొడ్డిపల్లె, రాతిగుంటపల్లె, నవాబు పేట, ముడియంవారిపల్లె పంచాయతీల్లో ‘బాబు స్యూరిటీ...  భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. గుర్రంకొండ, కలకడల్లో వంద కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డికి పీలేరు ఎమ్మెల్యే చింతల పాదాభివందనం చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే హోదాలో సొంతంగా ఒక్క పని చేయలేని దయనీయ స్థితిలో ఉన్నారని, సొంత వ్యక్తిత్వం లేని వ్యక్తికి ఓటేయాలో? స్వతహాగా ప్రజా సేవ చేసేవారిని ఆదరించాలో ఓటర్లు నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చింతలకు ఓటేస్తే పెద్దిరెడ్డి దౌర్జన్యకాండ అమల్లోకి వస్తుందని, అదే నల్లారి సోదరులకు ఓటేస్తే ప్రగతి పథంలో దూసుకుపోతుందని వివరించారు.

వైకాపా నుంచి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరిన పలువురు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని