icon icon icon
icon icon icon

మంత్రి జోగి రమేష్‌ నామినేషన్‌.. జాతీయ రహదారిపై 4 గంటల నరకం

కృష్ణా జిల్లా పెనమలూరు వైకాపా అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా బుధవారం నిర్వహించిన బలప్రదర్శన ప్రయాణికులకు నాలుగు గంటలు నరకం చూపింది.

Updated : 25 Apr 2024 08:44 IST

నగదు, మద్యం వెదజల్లి ర్యాలీకి జనసమీకరణ

పెనమలూరు, పోరంకి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా పెనమలూరు వైకాపా అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా బుధవారం నిర్వహించిన బలప్రదర్శన ప్రయాణికులకు నాలుగు గంటలు నరకం చూపింది. పెనమలూరు కూడలికి విజయవాడ వైపు పోరంకి, కామయ్యతోపు వరకు.. కంకిపాడు వైపు నుంచి వచ్చే వాహనాలు గంగూరు, ఈడుపుగల్లు, గోశాల వరకు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ప్రదర్శన నిలిచింది. ప్రయాణికుల వాహనాలు కిలోమీటర్ల మేర బారులు దీరాయి. 108, ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్సులు ట్రాఫిక్‌లో గంటలపాటు ఇరుక్కుపోయాయి. మండుటెండల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర అవస్థల పాలయ్యారు. కనీసం మంచినీరందక విలవిల్లాడారు. తాడిగడప 100 అడుగుల రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ పెనమలూరు సెంటర్‌ వరకు సాగింది. నామినేషన్‌ కార్యక్రమానికి భారీగా జనసమీకరణ కోసం మద్యం, నగదు పంపిణీ చేశారు. ఒక వ్యక్తికి రూ.500, మద్యం సీసా చేతిలో పెట్టి పల్లెల నుంచి ఆటోల్లో రప్పించారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ హల్‌చల్‌ చేయడంతోపాటు పిల్లలను ప్రచారానికి వాడుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని