icon icon icon
icon icon icon

అనకాపల్లి

అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం (Anakapalli Lok Sabha constituency) 1962లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్‌ కేటగిరిలో ఉంది. 

Published : 03 May 2024 14:55 IST

లోక్‌సభ నియోజకవర్గ సమాచారం

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: పస్తుతం ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మాడుగుల, చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట (ఎస్సీ), నర్సీపట్నం అసెంబ్లీ స్థానాలున్నాయి.

ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం.. నియోజకవర్గంలో 12.77 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో పురుషులు 6.23 లక్షలు, మహిళలు 6.53 లక్షలు, ట్రాన్స్‌జెండర్లు 38 మంది ఉన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 10 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. తెదేపా అభ్యర్థి ఆనంద్‌ కుమార్‌పై వైకాపాకి చెందిన బీశెట్టి.వెంకట సత్యవతి విజయం సాధించారు.

పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వీళ్లే

ప్రస్తుతం ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా భాజపా నుంచి సీఎం రమేష్‌ పోటీ చేస్తుండగా,  వైకాపా నుంచి బూడి ముత్యాలనాయుడు బరిలో ఉన్నారు. అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన సీఎం రమేష్‌ రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి. ఆర్థికంగానూ బలమైన వ్యక్తి. ఇవన్నీ కలిసి వస్తాయనే భాజపా రమేష్‌ను అనకాపల్లి నుంచి రంగంలో దించింది. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి తొలి మహిళా ఎంపీగా గెలిచి రికార్డులకెక్కిన డాక్టరు భీశెట్టి వెంకట సత్యవతి రెండోసారి పోటీ చేయాలనుకున్నారు. కానీ, వైకాపా ఆమె స్థానంలో ఈసారి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడ్ని బరిలోకి దించింది. కాంగ్రెస్‌ నుంచి వేగి వెంకటేష్‌ పోటీ చేస్తున్నారు. ఈయన ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ పార్టీ కమిటీ సభ్యుడిగా, పీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

  • ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
  • 1962: ఎం.ఎస్‌. మూర్తి ( కాంగ్రెస్‌)
  • 1967: ఎం.ఎస్‌. మూర్తి ( కాంగ్రెస్‌)
  • 1971: ఎస్‌.ఆర్‌.ఎ.ఎస్‌. అప్పలనాయుడు (కాంగ్రెస్‌)
  • 1977: ఎస్‌.ఆర్‌.ఎ.ఎస్‌. అప్పలనాయుడు (కాంగ్రెస్‌)
  • 1980: ఎస్‌.ఆర్‌.ఎ.ఎస్‌. అప్పలనాయుడు (కాంగ్రెస్‌)
  • 1984: పి. అప్పలనరసింహం (తెదేపా)
  • 1989: కొణతాల. రామకృష్ణ (కాంగ్రెస్‌)
  • 1991: కొణతాల. రామకృష్ణ (కాంగ్రెస్‌)
  • 1996: అయ్యన్నపాత్రుడు. చింతకాయల (తెదేపా)
  • 1998: గుడివాడ. గురునాథరావు (కాంగ్రెస్‌)
  • 1999: గంటా శ్రీనివాసరావు (తెదేపా)
  • 2004: పప్పల. చలపతిరావు ( తెదేపా)
  • 2009: సబ్బం. హరి (కాంగ్రెస్‌)
  • 2014: ముత్తంశెట్టి. శ్రీనివాసరావు (తెదేపా)
  • 2019: బీశెట్టి. వెంకట సత్యవతి (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img