icon icon icon
icon icon icon

గుంటూరు

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం (Guntur Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. జనరల్‌ కేటగిరీలో ఉంది.

Published : 03 May 2024 14:55 IST

2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అంతకుముందు నియోజకవర్గ పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గాలు నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి అసెంబ్లీ స్థానాలు ఇందులోకి వచ్చిచేరాయి.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు:  ప్రస్తుతం ఈ నియోజకవర్గ పరిధిలో గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తెనాలి, పొన్నూరు, తాడికొండ (ఎస్సీ) , మంగళగిరి, పత్తిపాడు (ఎస్సీ) నియోజకవర్గాలు ఉన్నాయి.

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం మొత్తం 17,71,105 ఓటర్లు ఉండగా, 8,56,985 పురుషులు 9,13,929 మహిళలు, 191 ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌పై తెదేపా అభ్యర్థి గల్లా జయ్‌దేవ్‌ విజయం సాధించారు.

ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌, వైకాపా నుంచి కిలారి వెంకట రోశయ్యలు బరిలో ఉన్నారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీ నుంచి జంగాల అజయ్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు.

  • ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు
  • 1952: ఎస్.వి.ఎల్.నరసింహం (స్వతంత్ర)
  • 1957: కె.రఘురామయ్య (కాంగ్రెస్)
  • 1962: కె.రఘురామయ్య (కాంగ్రెస్)
  • 1967: కె.రఘురామయ్య (కాంగ్రెస్)
  • 1971: కె.రఘురామయ్య (కాంగ్రెస్)
  • 1977: కె.రఘురామయ్య (కాంగ్రెస్)
  • 1980: ఎన్.జి.రంగా కాంగ్రెస్ (ఐ)
  • 1984: ఎన్.జి.రంగా (కాంగ్రెస్)
  • 1989: ఎన్.జి.రంగా (కాంగ్రెస్)
  • 1991: ఎస్.ఎం.లాల్‌జాన్‌బాషా (తెదేపా)
  • 1996: రాయపాటి సాంబశిరావు (కాంగ్రెస్)
  • 1998: రాయపాటి సాంబశివరావు (కాంగ్రెస్)
  • 1999: వై.వి.రావు (తెదేపా)
  • 2004 :రాయపాటి సాంబశివరావు (కాంగ్రెస్)
  • 2009 :రాయపాటి సాంబశివరావు (కాంగ్రెస్)
  • 2014: గల్లా జయ్‌దేవ్‌ (తెదేపా)
  • 2019: గల్లా జయ్‌దేవ్‌ (తెదేపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img