TTD: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏపీ ప్రభుత్వం నూతన ఛైర్మన్‌ను నియమించింది. ఆయన రెండేళ్ల పాటు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Updated : 05 Nov 2023 16:02 IST

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar reddy) నియమితులయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈమేరకు దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల వలెవన్‌ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుత తితిదే పాలకమండలి గడువు ఆగస్టు 8న ముగుస్తున్నందున కొత్త పాలకమండలిని నియమించాల్సి ఉందని పేర్కొంటూ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తితిదే ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా ఆయన నియామకం తర్వాత సభ్యుల నియామకం కూడా చేపడతామని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. ఆగస్టు 8న ప్రస్తుత బోర్డు పదవీకాలం ముగిసిన అనంతరం కొత్త పాలకమండలి ఛైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డి నియామకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో భూమన  జన్మించారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్‌రెడ్డి గతంలోనూ తితిదే ఛైర్మన్‌గా పనిచేశారు. వైఎస్‌ హయాంలో 2006 నుంచి 2008 వరకు తితిదే ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2012 ఉప ఎన్నికలో, 2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని