Bhumana Karunakar Reddy: తితిదే ఛైర్మన్‌గా భూమన ప్రమాణస్వీకారం

తితిదే నూతన ఛైర్మన్‌గా వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

Updated : 05 Nov 2023 16:02 IST


తిరుమల: తితిదే నూతన ఛైర్మన్‌గా వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గరుడాళ్వార్‌ సన్నిధిలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకూ తితిదే ఛైర్మన్‌గా కొనసాగిన వైవీ సుబ్బారెడ్డితో పాటు బోర్డు పదవీకాలం ఈనెల 8తో ముగిసింది. 

వైయస్‌ఆర్‌ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో జన్మించిన భూమన కరుణాకర్‌రెడ్డి.. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. ఆయన గతంలోనూ 2006 నుంచి 2008 వరకు తితిదే బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. గతంలో పేద వధూవరుల కోసం కల్యాణమస్తు, వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణాలు చేయించేందుకు దళిత గోవిందం వంటి కార్యక్రమాలను అమలుచేశారు. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరిగిన దృష్ట్యా.. ప్రతి పౌర్ణమికి తిరుమలలో గరుడ వాహన సేవను ప్రారంభించారు. తాజాగా రెండో పర్యాయంలో రెండేళ్లపాటు ఆయన తితిదే ఛైర్మన్‌ పదవిలో కొనసాగనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని