4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!

అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు.

Updated : 02 May 2024 16:54 IST

పామిడి: అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్‌ వెళ్తోన్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. నాలుగు కంటైనర్లలో రూ.2వేల కోట్లు ఉన్నాయని వెల్లడించారు. పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం కొచ్చి ఆర్‌బీఐ నుంచి హైదరాబాద్‌ ఆర్‌బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయని తెలిపారు.

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం.. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, జిల్లా కలెక్టర్‌, ఐటీ అధికారులకు స్థానిక పోలీసులు సమాచారమందించారు. వారి సమక్షంలో కంటైనర్లు తనిఖీ చేసి.. నిబంధనల ప్రకారమే నగదు తరలిస్తున్నారా? లేదా? అనేది నిర్ధరించుకున్నారు. ఐటీ అధికారులు అనుమతించిన తర్వాత కంటైనర్లను హైదరాబాద్‌కు తరలించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని