బాపట్ల తీరానికి అత్యంత దగ్గరగా ‘మిగ్‌జాం’.. గంటకు 12కిమీ వేగంతో..

తీవ్ర తుపాను మిగ్‌జాం (Cyclone Michaung) మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల సమీపంలోకి తుపాను వచ్చినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. బాపట్ల తీరానికి అత్యంత దగ్గరగా ‘మిగ్‌జాం’ కదులుతోందని చెప్పారు.

Updated : 05 Dec 2023 12:30 IST

విశాఖపట్నం: తీవ్ర తుపాను మిగ్‌జాం (Cyclone Michaung) మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల సమీపంలోకి తుపాను వచ్చినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. బాపట్ల తీరానికి అత్యంత దగ్గరగా ‘మిగ్‌జాం’ కదులుతోందని చెప్పారు. మంగళవారం ఉదయం గంటకు 7కి.మీ వేగంతో కదిలిన తుపాను.. ప్రస్తుతం 12కి.మీ వేగంతో వస్తోందని తెలిపారు. విశాఖలో మీడియాతో సునంద మాట్లాడారు.  

‘‘తుపాను ఉత్తర దిశగా కదులుతూ బాపట్ల వద్ద తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు భారీగా ఎగసిపడతాయి. తుపాను తీరం దాటి భూభాగంపైకి వచ్చాక క్రమంగా బలహీనపడుతుంది. మరో 24 గంటలపాటు రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి’’ అని ఆమె తెలిపారు. తుపాను నేపథ్యంలో బాపట్ల, నిజాంపట్నం, మచిలీపట్నంలో 10వ నంబర్‌ ప్రమాదహెచ్చరిక కొనసాగుతోంది. కాకినాడలో 9, విశాఖ, కళింగపట్నంలో 3వ నంబర్‌ హెచ్చరిక జారీ చేశారు. తుపాను ప్రస్తుతం బాపట్లకు 60కి.మీ దూరంలో ఉంది. ‘మిగ్‌జాం’ ప్రభావంతో బాపట్ల, సూర్యలంక తీరాల్లో గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని