Tirumala: వరుస సెలవులు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 3 రోజుల వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు పోటెత్తారు.

Published : 07 Apr 2023 12:34 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. 3 రోజుల వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. ఇప్పటికే సర్వ దర్శనం కోసం టోకెన్లు లేకుండా భక్తులు చేరుకున్నారు. సర్వదర్శనానికి టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. దీంతో క్యూలైన్‌ గోగర్భం జలాశయం వరకు చేరుకుంది.

శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయంపైనే పడుతుందని తితిదే వర్గాల సమాచారం. సాయంత్రంలోపు భక్తుల రద్దీ తగ్గకపోతే క్యూలైన్లో ప్రవేశాన్ని రద్దు చేసి శనివారం ఉదయం నుంచి అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రద్దీ పరిస్థితిని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలను శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. సాయంత్రంలోపు భక్తుల రద్దీ తగ్గకపోతే క్యూలైన్లో ప్రవేశాన్ని రద్దు చేసి శనివారం ఉదయం నుంచి అనుమతించే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని