ప్రియాంక.. తప్పుడు వార్తని తొలగించండి 

ఆగ్రాలో ఇటీవల 48 గంటల్లో 28 మంది మంది కరోనా బాధితులు మృతిచెందారని ఓ తప్పుడు వార్త ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ సోమవారం ట్వీట్‌ చేశారు...

Published : 23 Jun 2020 23:56 IST

కాంగ్రెస్‌ సెక్రటరీకి ఆగ్రా పాలనాధికారి ఈ-మెయిల్‌

లఖ్‌నవూ: ఆగ్రాలో ఇటీవల 48 గంటల్లో 28 మంది మంది కరోనా బాధితులు మృతిచెందారని ఓ తప్పుడు వార్త ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ సోమవారం ట్వీట్‌ చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ నిజాన్ని బయటకు తెలపకుండా దాచిపెడుతోందని, అది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించిన జిల్లా పాలనాధికారి ప్రభునరైన్‌ సింగ్‌ అది తప్పుడు సమాచారమని, దాన్ని వెంటనే తొలగించాలని ఆమెకు ఈ-మెయిల్‌ చేశారు. ఇందుకు సంబంధించి 24 గంటల్లో తన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని కలెక్టర్‌ కోరారు. 

ఒక ట్విటర్‌ యూజర్‌ నిజనిర్ధారణ చేసుకోకముందే ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా 48 గంటల్లో 28 మంది మరణించారనే తప్పుడు వార్తను ప్రచారం చేశాడని ప్రియాంకకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నారు. ఇలాంటివి చేస్తే వైద్యుల అంకితభావం దెబ్బతింటుందని, వారు నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని వివరించారు. ఆ తప్పుడు వార్తలు సామాన్య జనంపైనా ప్రభావం చూపుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తను తొలగించాలని, తద్వారా ప్రజలకు వాస్తవిక పరిస్థితులు తెలుస్తాయని కలెక్టర్‌ చెప్పారు. ఇక ఆగ్రాలో ఇప్పటివరకూ మొత్తం 1,139 కేసులు నమోదయ్యాయని, అందులో 79 మంది మాత్రమే మృతిచెందారని స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని