Ramineni foundation:నేడు రామినేని ఫౌండేషన్‌ అవార్డుల ప్రదానం

విభిన్న రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖులకు డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌-యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఏటా అందించే

Updated : 23 Dec 2021 12:04 IST

2021కు డా.కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, 2020కి డా.జి.ఆర్‌.చింతలకు పురస్కారాలు

ముఖ్య అతిథిగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: విభిన్న రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖులకు డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌-యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఏటా అందించే పురస్కారాల ప్రదానోత్సవం గురువారం జరగనుంది. ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ధర్మప్రచారక్‌ రామినేని, సమన్వయకర్త పాతూరి నాగభూషణం ఈ వివరాలను బుధవారం ప్రకటించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో గురువారం అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. 2021 సంవత్సరానికి విశిష్ఠ పురస్కారాలను భారత్‌ బయోటెక్‌ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.కృష్ణ ఎల్ల, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లకు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. విశేష పురస్కారాలను నటుడు బ్రహ్మానందం, నిమ్స్‌ అనస్థీషియా విభాగాధిపతి డా.దుర్గా పద్మజ, తెలుగు సినీ జర్నలిస్టు ఎస్‌వీ.రామారావుకు అందజేస్తామని తెలిపారు. 2020 సంవత్సరానికి గాను విశిష్ఠ పురస్కారాన్ని నాబార్డ్‌ ఛైర్మన్‌ డా.జి.ఆర్‌.చింతల, ప్రత్యేక పురస్కారాన్ని నటుడు సోనూసూద్‌కు అందించనున్నట్లు వెల్లడించారు. విశేష పురస్కారాలను టీవీ వ్యాఖ్యాత సుమ కనకాల, హీలింగ్‌ హస్త హెర్బల్స్‌ సంస్థ ఎండీ డా.బి.మస్తాన్‌ యాదవ్‌, శిరిడీలోని ద్వారకామయి సేవా ట్రస్ట్‌ వ్యవస్థాపక మేనేజింగ్‌ ట్రస్టీ బండ్లమూడి శ్రీనివాస్‌ అందుకుంటారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని