హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఇంటినుంచి బయటకు రావొద్దని డీఆర్‌ఎఫ్‌ హెచ్చరిక

జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్‌, తిరుమలగిరి, అల్వాల్‌, బోయిన్‌పల్లి, జవహర్‌నగర్‌, బేగంపేట్‌, బొల్లారం, మారేడుపల్లి, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్‌, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Updated : 24 Jul 2023 19:12 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) పరిధిలో భారీ వర్షం పడుతోంది. నగరంలోని బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, యూసఫ్ గూడ, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట విద్యానగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ వర్షం కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చెట్లు నేలకూలి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

నగరంలో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. చెరువులను తలపించేలా మారిన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. నగరంలో భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అధికారులు హెచ్చరించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని డీఆర్‌ఎఫ్‌ బృందాలు హెచ్చరించాయి. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని