Mekapati Gautham Reddy: నెల్లూరు నివాసానికి చేరుకున్న మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరు చేరుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి బేగంపేట

Updated : 22 Feb 2022 14:10 IST

నెల్లూరు: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరు చేరుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో నెల్లూరు పరేడ్‌ గ్రౌండ్స్‌కు తీసుకొచ్చారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం మంత్రి నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. గౌతమ్‌రెడ్డి పార్థివదేహం వద్ద పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. తమ అభిమాన నేత చివరి చూపు కోసం పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు, అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.

రేపు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి ఇప్పటికే బయల్దేరారు. ఈ సాయంత్రానికి ఆయన నెల్లూరు చేరుకునే అవకాశముంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని