SC Railways: ప్లాట్‌ఫామ్‌ టికెట్ ధరల తగ్గింపు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి వేళ  స్టేషన్లలో...

Updated : 26 Jul 2021 18:15 IST

హైదరాబాద్‌: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన రైల్వే ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారి వేళ  స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు టికెట్‌ ధరను రూ.50గా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అన్‌రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌, సాధారణ రైళ్లను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాట్‌ఫామ్‌ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  తాజాగా తగ్గించిన ధరల ప్రకారం.. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లల్లో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధర రూ.10, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ ధర మాత్రం రూ.20 ఉంటుందని రైల్వే శాఖ  అధికారులు తెలిపారు. కొవిడ్‌ మాదర్గదర్శకాలతో పాటు ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలను యథావిధిగా పాటిస్తూ రైల్వే యాజమాన్యానికి సహకరించాల్సిందిగా పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ సి.హెచ్‌ రాకేశ్‌ కోరారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని