ISRO: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-56

పీఎస్‌ఎల్‌వీ సీ-56 ప్రయోగం విజయవంతమైంది.

Updated : 14 Aug 2023 18:09 IST

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ సీ-56 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌-సార్‌ ప్రధాన ఉప్రగ్రహంతో పాటు ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. మొత్తం 420కిలోల బరువుగల 7 ఉపగ్రహాలను PSLV C-56 మోసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి56 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో ఇది మూడోది కావడం విశేషం.

ఆకాశమే హద్దు!

ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో అధిపతి డా.సోమనాథ్‌ మాట్లాడుతూ ఉపగ్రహాలను కచ్చితమైన కక్ష్యలోకి వాహకనౌక ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘‘పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపట్టబోతున్నాం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం ఉంటుంది. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని సోమనాథ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు