TSRTC: ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు.. తప్పిన పెను ప్రమాదం

కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది.

Updated : 24 Dec 2023 20:13 IST

హనుమకొండ: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఆర్టీసీ (TSRTC) డిపో పల్లెవెలుగు అద్దె బస్సు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజూరాబాద్‌-హనుమకొండ (Hanamkonda News) రూట్‌లో వెళ్తున్న  బస్సు ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమవైపు ఉన్న రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 42మంది ప్రయాణికులు ఉన్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. బస్సు డ్రైవర్‌ రాజు అప్రమత్తమై బస్సును వెంటనే ఆపడం వల్ల ఎవరికీ  ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఓవర్‌ లోడింగ్‌ వల్లే ప్రమాదం జరిగినట్టు వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తమని సజ్జనార్‌ పేర్కొన్నారు.  ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అద్దె బస్సుల నిర్వహణ విషయంలో వాటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని, తరచూ తనిఖీ చేస్తూ బస్సులను ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని