Supreme Court: జగన్‌ అక్రమాస్తుల కేసు.. విజయసాయిరెడ్డికి సుప్రీం నోటీసులు

జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌, వైకాపా పార్లమెంటరీ పార్టీ  నేత విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  

Published : 05 Jul 2023 17:24 IST

దిల్లీ: జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్‌, భారతి సిమెంట్స్‌, వైకాపా పార్లమెంటరీ పార్టీ  నేత విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  సీబీఐ కేసుల విచారణ తేలే వరకు ఈడీ కేసుల విచారణ ఆపాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.

ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం సెప్టెంబరు 5లోగా సమాధానం చెప్పాలని  ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు పూర్తి స్థాయి విచారణ ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలో, త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలో ఆరోజే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.  సీబీఐ, ఈడీ కేసుల విచారణ సమాంతరంగా కొనసాగించవచ్చని  గతంలో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు తీర్పునివ్వగా.. తెలంగాణ హైకోర్టు దాన్ని పక్కన పెడుతూ సీబీఐ ఛార్జిషీట్లపై తీర్పు వెల్లడైన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని 2021లో తీర్పు ఇచ్చింది. 

మరో వైపు జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా జప్తు చేసిన భారతి ఆస్తుల విడుదలకు  గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 14న సుప్రీంకోర్టులో జరగనుంది.  జప్తు ఆస్తులకు సమాన విలువైన ఎఫ్‌డీలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు