Ts News: వేములవాడకు పోటెత్తిన భక్తజనం.. దర్శనానికి ఐదున్నర గంటల సమయం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకొనేందుకు

Updated : 13 Dec 2021 17:38 IST

వేములవాడ గ్రామీణం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి స్నానాలు ఆచరించిన భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. దర్శనానికి సుమారు ఐదున్నర గంటల సమయం పడుతోంది. ఇవాళ 60వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని