Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 25 May 2023 09:05 IST

1. కాసుల కక్కుర్తి..గాడి తప్పిన గస్తీ

శాంతిభద్రతల నిర్వహణలో కీలకమైన రాత్రి పోలీసు గస్తీ నవ్వులపాలవుతోంది. కొందరు సిబ్బంది  బిర్యానీ ప్యాకెట్లు.. ఐస్‌క్రీమ్‌లు.. పండ్లరసాలకు ఆశపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. గ్రేటర్‌వ్యాప్తంగా పలు ఐస్‌క్రీమ్‌ పార్లర్లు నడుపుతున్న నిర్వాహకులు కొన్ని ఠాణాలకు నెలకు రూ.2లక్షలు మామూళ్లు పంపుతున్నారనే ఆరోపణలుస్తున్నాయి. దక్షిణ మండలంలోని పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఉండే ఓ ఠాణా పరిధిలో రాత్రివేళ కాలనీ మధ్య మందుబాబులు వీరంగం చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించట్లేదని తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

2. క్షణాల్లో కమ్మేసి.. నిర్దయగా ఈడ్చేసి..

రాజధాని రైతులపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. శాంతియుతంగా దీక్ష చేసేందుకు సన్నద్ధమైన వారిని నానా దుర్భాషలాడారు. దీక్షా శిబిరాన్ని కమ్మేసి.. కర్కశంగా ఈడ్చి పారేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు తేడా లేకుండా జులుం ప్రదర్శించారు.  తుళ్లూరు దీక్షా శిబిరం చెంత వందలాదిగా మోహరించి భయానక వాతావరణం సృష్టించారు. ఇలాంటి నిర్బంధాలు.. బెదిరింపులకు వెరవబోమని త్యాగధనులు నినదించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. విద్యుత్తు ధర్మం ఇదేనా ?

విద్యుత్తు డిమాండ్‌ అమాంతం పెరగడంతో కరెంట్‌ తీగలు తట్టుకోలేకపోతున్నాయి. ఎండలు ముదరడంతో ఏసీల వాడకంతో భారీగా లోడ్‌ పెరిగింది. రోజులో ఏ దశలోనూ 3 వేల మెగావాట్లు తగ్గడం లేదు. ఇటీవల గరిష్ఠంగా 3,760 మెగావాట్లను తాకింది. దీంతో తరచూ ఫ్యూజ్‌లు ఎగిరిపోతున్నాయి. రోజులో చాలా ప్రాంతాల్లో ఐదారుసార్లు కరెంట్‌ పోతూ వస్తోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. అంతకు మించి.. అమాంతం పెంచి

పుస్తక విలువకు.. బహిరంగ మార్కెట్‌ విలువకు ఎక్కువ తేడా ఎక్కడుంది..? భూములకు గిరాకీ ఎక్కడ ఎక్కువ? దస్తావేజు రిజిస్ట్రేషన్లు అధికంగా ఎక్కడ జరుగుతున్నాయి...? ప్రస్తుతం ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది..భవిష్యత్తులో ఇంకా ఆస్కారం ఎక్కడుంది..? రానున్న రోజుల్లో భూములకు గిరాకీ ఏ ప్రాంతాల్లో పెరిగే వీలుంది..? వ్యవసాయ భూములు.. వ్యవసాయేతరగా ఏ చోట మారుతున్నాయి....? లేఅవుట్లు ఎక్కడెక్కడ వేశారు... ఇలా భిన్నకోణాల్లో కసరత్తు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. స్కాన్‌ చేస్తే పాఠాలు ప్రత్యక్షం

ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పది, ఇంటర్‌ పుస్తకాలు జిల్లాకేంద్రాలకు చేరుకుంటున్నాయి. ఆర్టీసీ కార్గో సర్వీస్‌ ద్వారా నిత్యం బస్సుల్లో నిల్వలు సమకూరుతున్నాయి. పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. విద్యార్థులు దీనిని చరవాణి ద్వారా స్కాన్‌ చేస్తే పాఠ్యాంశాలు వస్తాయి. ఎస్సెస్సీ, ఇంటర్‌ తరగతుల వారికి ఈ విధానం అమలుతో మరింత సౌలభ్యం చేకూరనుంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. ఐఐటీహెచ్‌ చదువు.. సివిల్స్‌ కొలువు

ప్రతిష్ఠాత్మక యూపీఎస్సీ పరీక్షల్లో తమ పూర్వ విద్యార్థులు ముగ్గురు ఉత్తమ ర్యాంకులు సాధించడం ఐఐటీ హైదరాబాద్‌కు గర్వకారణమని ఆ సంస్థ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌మూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువతకూ వీరు ప్రేరణగా నిలిచారని ప్రశంసించారు. డాక్టర్‌ ముద్రికాఖండేల్‌వాల్‌, ఆచార్యులు ఎస్‌ సూరియ ప్రకాశ్‌, ఉమాశంకర్‌, శివ్‌గోవింద్‌సింగ్‌, రాంజీ విజేతలకు అభినందనలు తెలిపారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ ప్రజలకు సేవ చేసేందుకు ముందడగు వేయడం గొప్ప విషయమన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. రిటైర్మెంట్‌కు ఇంకా సమయముంది

ధోని ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై అస్పష్టత కొనసాగుతూనే ఉంది. తనకిదే చివరి ఐపీఎల్‌ అని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో మహి మరోసారి స్పందించాడు. రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి తనకు ఇంకా 8-9 నెలల సమయం ఉందని చెప్పాడు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8.ఐటీ కొలువులు తగ్గి.. విదేశీ చదువులకు మొగ్గు!

ప్రాంగణ నియామకాల్లో కొలువులకు ఎంపికై ఏడాది దాటినా కంపెనీల నుంచి పిలువులు రావడం లేదు.. చదువు పూర్తయి సంవత్సరం అయినా శుభవార్త చెవిన పడటం లేదు. ఐటీ రంగంలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అధికసంఖ్యలో విద్యార్థులు విదేశీవిద్యకు మొగ్గు చూపుతున్నారు. ఒకటీ రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత విదేశీవిద్యపై ఆలోచిద్దాం అనుకున్నవారూ ఇక ఆలస్యం చేయకుండా వీసాలకు దరఖాస్తు చేస్తున్నట్లు ఇంజినీరింగ్‌ కళాశాలల వర్గాలు చెబుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. 1.50 లక్షల మందికి.. 4.05 లక్షల ఎకరాలు

అటవీ భూముల్ని సాగు చేస్తున్న గిరిజనులకు పోడు పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో సచివాలయంలో గురువారం సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, హరితహారం, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ తదితర అంశాలపైనా సమీక్షిస్తారు. ప్రధానంగా పోడు పట్టాల పంపిణీని జూన్‌ 24 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. పరీక్షను అర్ధం చేసుకుంటే..దాదాపు గెలిచినట్టే!

వైఫల్యాలు ఎదురైనపుడు కుంగిపోకుండా వాటినుంచి పాఠాలు నేర్చుకుంటేనే పురోగతి సాధ్యం! జాతీయ స్థాయిలో జరిగే అత్యున్నత పరీక్షలు రాసే అభ్యర్థులు తాము చేసిన లోపాలు గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవడం తప్పనిసరి. తాజా సివిల్‌ సర్వీస్‌ పరీక్షల ఫలితాల్లో అఖిలభారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.. తెలంగాణ విద్యార్థిని నూకల ఉమా హారతి! ఆమెతో ‘చదువు’ముఖాముఖీ.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని