Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Apr 2024 09:09 IST

1. 30 ఏళ్ల తరవాత... కేన్స్‌లో ఆమె!

పాయల్‌ కపాడియా... భారతీయ సినిమా గొప్పతనాన్ని కేన్స్‌ కార్పెట్‌పై నడిపించబోతోన్న యువతి. మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తరవాత పాయల్‌ దర్శకత్వం వహించిన ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ అనే భారతీయ చిత్రం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మక ‘పామ్‌ డి ఓర్‌’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. పూర్తి కథనం

2. ఆ మౌనం వెనక.. దోచిపెట్టే మర్మం!

అద్భుత వనరులు, అపార అవకాశాలున్న ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్‌ సర్కారు తన స్వప్రయోజనాల కోసం భ్రష్టు పట్టిస్తోంది. ప్రజలు, యువత ఏమైపోతే మాకేంటి.. తమ, తమవాళ్ల గల్లాపెట్టెలు కళకళలాడితే చాలనేలా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఒక అద్భుత పారిశ్రామిక క్లస్టర్‌గా ఎదగాల్సిన ‘లేపాక్షి నాలెడ్జి హబ్‌’ను తన తండ్రి రాజశేఖరరెడ్డి హయాంలోనే జగన్‌ ఒక భారీ కుంభకోణంగా మార్చారు.పూర్తి కథనం

3. సాంగ్‌.. రాజా‘సింగ్‌’..!

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే.. హైదరాబాద్‌ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శ్రీరామనవమిని పురస్కరించుకొని తొలిసారి తెలుగులో పాట రాసి స్వయంగా పాడారు. నగరంలోని ధూల్‌పేట కేంద్రంగా శ్రీరామ నవమి శోభాయాత్రకు 13 ఏళ్ల క్రితం ఆయన శ్రీకారం చుట్టి దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్శించారు.పూర్తి కథనం

4. నేతన్న మగ్గానికి జగన్‌ ఉరి

ఉమ్మడి అనంత జిల్లాలో 1.50 లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు. తెదేపా హయాంలో ముడిపట్టుపై కిలోకు రూ.500 చొప్పున 4 కిలోల వరకు రాయితీ అందించేవారు. అంటే నెలకు రూ.2 వేలు, ఏడాదికి రూ.24 వేలు సాయం అందించేవారు. ఎలాంటి నిబంధనలు లేకుండా కార్మికులందరికీ వర్తింపజేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక రాయితీలు ఎత్తేసి ఏడాదికి ఒకేసారి రూ.24 వేలు ఇస్తున్నారు.పూర్తి కథనం

5. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ టికెట్‌.. తేల్చుడా? నాన్చుడా..?

ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆశావహులపై పార్టీలో  ఏకాభిప్రాయం కుదరకపోవటం, రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు ఆదివారం రానున్నారని, అభ్యర్థి ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.పూర్తి కథనం

6. 2 చేపలు రూ.4లక్షలు

కృష్ణా జిల్లా మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో 2 కచ్చిడీ చేపలు చిక్కాయి. వాటిని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో శనివారం వేలం వేయగా వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్‌(మావ్‌)ను ఔషధాలకు పొరలా, శస్త్రచికిత్సలో కుట్లు వేసే దారంలా వాడుతారని అందుకే అంత గిరాకీ అని మత్స్యకారులు తెలిపారు.పూర్తి కథనం

7. ప్రతినెలా బాదుడే.. బిల్లు చూస్తే దడే!!

వినియోగించిన విద్యుత్తుకు లెక్కకట్టి రుసుం ఎంత చూపుతున్నా...ఆ తరువాత క్రమంలో ఉన్న ఒక్కొక్క వరుస చదివిన ఎవరైనా తెల్లబోవాల్సింది. మొత్తం జనం జేబులు ఖాళీ అవుతున్నాయి. వైకాపా నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ‘బటన్‌ నొక్కుతున్నాం’గా అంటూ తప్పించుకునే ధోరణిలో పాలించారు.పూర్తి కథనం

8. బెట్టింగ్‌తో యువత చిత్తు

బంతి బంతికి ఉత్కంఠ, క్షణాల్లో మారే ఫలితం, ఆద్యంతం ఉద్వేగం, కావాల్సినంత వినోదం పంచే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) క్రికెట్‌ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతుండటంతో కొందరు జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. ప్రధానంగా రూ.500 నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారు. పూర్తి కథనం

9. వేసవి దొంగలొస్తున్నారు.. జాగ్రత్త!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగతనాలు ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా రాత్రిపూట దుండగులు సొత్తు క్షణాల్లో మాయం చేస్తున్నారు. 2022లో మొత్తం 474 దొంగతనాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఒక్క వేసవి (మార్చి, ఏప్రిల్‌, మే)లోనే 255 (54%) ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. అందునా రాత్రిపూట జరిగిన చోరీలు 127. 2023లోనూ ఇదే వరస ఎదురైంది.పూర్తి కథనం

10. నాడు అమితాబ్‌పైకి చున్నీలు విసిరి అమ్మాయిల సందడి

దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే ప్రతి ఎన్నికల్లోనూ జరిగే కొన్ని విచిత్ర సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి ఘటనే 1984లో జరిగింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని