ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 May 2024 09:12 IST

1. నోటు తీసుకున్నోళ్లు బటన్‌ నొక్కలేదే!

ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. ఓటుకు ఇచ్చిన నోటు లెక్కలు, వచ్చిన ఓట్ల లెక్కలు మాత్రం వారిలో కొంత అసంతృప్తిని మిగిల్చాయి. ఏ ప్రాంతంలో ఎవరు ఓటు వేసేందుకు రాలేదో అన్న లెక్కలను బూత్‌స్థాయి నుంచి ఆరా తీస్తున్నారు. పూర్తి కథనం

2. రద్దయిన క్రికెట్‌ మ్యాచ్‌కు టికెట్ల డబ్బు వాపసు

క్రికెట్‌ అభిమానులకు పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్‌ ఊరట కల్పించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో గురువారం రాత్రి హైదరాబాద్‌- గుజరాత్‌ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ రద్దయింది. ఈ నేపథ్యంలో టికెట్ల డబ్బు రీఫండ్‌ అవుతాయా? లేదా? అన్న ఆందోళన క్రికెట్‌ అభిమానుల్లో మొదలైంది.పూర్తి కథనం

3. కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్‌ను తలపిస్తున్న బెట్టింగ్‌లు

అమలాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి వర్గాలే చెబుతున్నాయంట.. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా.. అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థికి లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీ వస్తుందంటున్నారు. పోటీ అభ్యర్థి జాడ గ్రామాల్లో కనిపించకపోవడంతో అధికార పార్టీ ఓట్లూ కూటమికే పడ్డాయంటున్నారు.పూర్తి కథనం

4. గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా

గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తానని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేశానని గెలిస్తే అర్జునుడిని అవుతా, ఓడితే అభిమన్యుడిని అవుతానని అన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే నిజామాబాద్‌ నుంచి పోటీ చేశానని చెప్పారు.పూర్తి కథనం

5. దయచేసి వినండి.. ధరలు అధికం

గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ప్రయాణికులు ప్రశ్నించినా ఎమ్మార్పీకి ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. వారితో వాదనలకు దిగేందుకు సమయం లేనందున అధిక ధరలకు కొనుగోలు చేయక తప్పడంలేదు.పూర్తి కథనం

6. హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ

కృత్రిమ మేధ(ఏఐ)లో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే సమున్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు నగరంలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శుక్రవారం ఉదయం నార్సింగిలో తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో గ్రీన్‌ యాన్యువల్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ పదో సమ్మిట్‌-2024 నిర్వహించారు.పూర్తి కథనం

7. పోస్టింగ్‌ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!

ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. గత ఐదేళ్లుగా ఏబీవీకి పోస్టింగ్‌ ఇవ్వకుండా, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన జగన్‌ ప్రభుత్వం, వైకాపా వీరభక్త అధికారగణం ఆయనపై ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నాయి.పూర్తి కథనం

8. విదేశాలకు తరలిపోతున్నారా..?

ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అందుకోసం వారంతా వీసాలు, పాస్‌పోర్టులు తీసుకొనే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.పూర్తి కథనం

9. రాయ్‌బరేలీ మీ కుటుంబ స్థానమా?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్‌పుర్‌లో సభలో ఆయన ప్రసంగించారు. ‘ఇండియా కూటమి అంతా కుటుంబంపై ఆధారపడిందే. లాలూ తన కుమారుడిని, మమత తన మేనల్లుడిని ముఖ్యమంత్రుల్ని చేద్దామనుకుంటున్నారు.పూర్తి కథనం

10. టెట్‌ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!

ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాసే నిరుద్యోగ అభ్యర్థులనే కాదు... పదోన్నతుల కోసం రాసే ఉపాధ్యాయులనూ కష్టాలు చుట్టుముట్టాయి. దరఖాస్తు రుసుంను ఒకేసారి రూ.400 నుంచి రూ.వెయ్యికి పెంచి అభ్యర్థులపై ఆర్థిక భారం మోపిన అధికారులు...పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించి ముప్పుతిప్పలు పెడుతున్నారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని