Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 May 2024 09:18 IST

1. ఎన్నికలంటే అపహాస్యమా?

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి. పౌరులు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశాన్ని అర్హులైన ఓటర్లకు ఎన్నికల ద్వారా భాగస్వామ్యం కల్పిస్తారు. ప్రజలు ఎన్నుకున్న అభ్యర్థే ప్రభుత్వాన్ని నడపడంలో భాగస్వామ్యం అవుతారు. ఇంతటి కీలకమైన ఎన్నికలను పల్నాడు ప్రాంతంలో ప్రజాప్రతినిధులే కాలరాసే పరిస్థితికి వచ్చారు. పూర్తి కథనం

2. ‘మీ పిల్లలను అపహరించాం.. అడిగినంత ఇవ్వండి’

అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో మహ్మద్‌ అబ్దుల్‌ అర్భాత్‌ అనే భారతీయ విద్యార్థి మార్చి 7న కిడ్నాప్‌నకు గురయ్యాడు. పది రోజుల తర్వాత ఆయన్ను విడుదల చేయడానికి 1200 అమెరికన్‌ డాలర్లు డిమాండ్‌ చేస్తూ తల్లిదండ్రులకు ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ తర్వాత ఆ యువకుడు వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో విదేశాల్లో ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలోనూ ఈ తరహా రెండు ఘటనలు నమోదయ్యాయి.పూర్తి కథనం

3. వైకాపా.. విషవలయం

హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సంప్రదాయ ప్రచారం కంటే సామాజిక మాధ్యమాలనే ఎక్కువ నమ్ముకున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని మరీ పోరాడారు. గెలిస్తే తాము నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం? అవతలి పక్షంపై వ్యంగ్యాస్త్రాలు, వంటి వాటిపై ఆకట్టుకునేలా మీమ్స్‌ తయారు చేసి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.పూర్తి కథనం

4. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌.. కంప్యూటర్స్‌ సీటు.. సప‘రేటు’

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఇంకా ప్రారంభమవకుండానే యాజమాన్య కోటా సీట్ల రేట్లు పెంచేందుకు కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కంప్యూటర్‌ సైన్స్, డేటాసైన్స్, కృత్రిమ మేధ సీట్ల ద్వారా రూ.లక్షలు దండుకునేందుకు కొత్త ట్రిక్కులు అమలు చేస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్లు, డొనేషన్ల వివరాల కోసం కళాశాలలకు విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్తే.. సీట్లు భర్తీ అయ్యాయంటూ చెబుతున్నారు.పూర్తి కథనం

5. రోజూ 90 శాతం విద్యార్థుల హాజరు తప్పనిసరి

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో రోజూ 90 శాతానికిపైగా విద్యార్థుల హాజరు ఉండాలని విద్యాశాఖను ఆదేశించింది. ‘విద్యాహక్కు చట్టం-2009’.. తరగతులు, సబ్జెక్టుల వారీగా పిల్లలు నేర్చుకోవాల్సిన అంశాలను నిర్దేశించినందున లక్ష్య సాధనకు పిల్లలు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని పేర్కొంది.పూర్తి కథనం

6. ప్రభుత్వ నిర్ణయం.. రొయ్యకు ప్రాణసంకటం

పెట్రోలు బంకుల్లో వాహనాలకు తప్ప విడిగా పెట్రోలు, డీజిల్‌ విక్రయించరాదన్న ఎన్నికల అధికారుల ఆదేశాలు ఆక్వా రైతులను ఆపదలోకి నెట్టాయి. కరెంటు కోతలు, సరఫరాకు అంతరాయంతో చెరువుల్లో ఏరియేటర్లు తిప్పి రొయ్యలకు ఆక్సిజన్‌ అందించడానికి జనరేటర్లు నడపడానికి డీజిల్‌ కావాల్సి ఉంది. ఎన్నికల అధికారుల ఆదేశాలు చూపి ఆక్వా రైతులకు పెట్రోలు బంకు నిర్వాహకులు క్యాన్లలో డీజిల్‌ పోయడం లేదు.పూర్తి కథనం

7. గొడవలకు స్వస్తి.. అభివృద్ధికి నాంది

రాజకీయ మారణహోమంతో అట్టుడికిన ఆ గ్రామం ఇప్పుడు నవోదయంతో తొణికిసలాడుతోంది. కక్షలు, కార్పణ్యాలతో నష్టపోయిన ఓ తరం.. తమ భావితరాల బాగుకోసం చేసిన కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు అక్కడ ప్రత్యర్థులు అనే మాటే లేదు. క్షణికావేశంలో చోటుచేసుకున్న విషాద ఘటనలను మర్చిపోయి అన్నివర్గాల వారూ కలిసిమెలిసి జీవిస్తూ.. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పూర్తి కథనం

8. ‘లాడ్జికొస్తావా! డిప్యుటేషన్‌ రద్దు చేయించమంటావా!!’

 ‘నీ డిప్యుటేషన్‌ రద్దు చేయించకుండా ఉండాలంటే నా కోరిక తీర్చాలి. మార్కాపురంలోనే నా స్నేహితుడికి లాడ్జి ఉంది. అక్కడికి వస్తావా! లేదంటే పొదిలికి రా.. అక్కడా కుదరదంటే కంభం వచ్చినా సరే. ఎక్కడనేది నీ ఇష్టం. నేను చెప్పినట్లు చేయకుంటే డిప్యుటేషన్‌ రద్దు చేయిస్తా. అప్పుడు ఇక్కడే ఉద్యోగం చేసుకోలేవు.పూర్తి కథనం

9. చేనేత బదులు పవర్‌లూమ్‌ వస్త్రాలు విక్రయించిన వారిపై చర్యలు

పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యార్థులకు యూనిఫామ్‌ తయారీకి చేనేత బదులు పవర్‌లూమ్‌ వస్త్రాలు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో చేనేత శాఖపై ఆయన సమీక్షించారు. ‘చేనేత వస్త్రాలకు అవసరమైన నూలు రాయితీ కోసం రూ.33.24 కోట్లను టెస్కో విడుదల చేసింది.పూర్తి కథనం

10. 48 గంటలు.. 26 అక్రమ రిజిస్ట్రేషన్లు

ఖిలావరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కేవలం 48 గంటల్లో 26 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందుకు కారణమైన ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేశ్‌ను జిల్లా అధికారులు సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఖిలా వరంగల్‌ కార్యాలయ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్తిక్‌ సెలవుపై వెళ్లడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వరంగల్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజేశ్‌కు గత నెల 23న ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు