Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Jun 2024 13:07 IST

1. విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు

నగరంలో డయేరియా మరణాలు ఆందోళనకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. పూర్తి కథనం 

2. ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం

లోక్‌సభ ఎన్నికల తుది దశ పోలింగ్‌లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు(శనివారం) పోలింగ్‌ జరుగుతోంది.  బెంగాల్‌ జయనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ అల్లరిమూక పోలింగ్ స్టేషన్‌లోకి చొరబడి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని(EVM) చెరువులో విసిరేసిన ఘటనతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.పూర్తి కథనం 

3. గవర్నర్‌ను కలిసిన సీఎం రేవంత్‌.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం..

గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన్ను ఆహ్వానించారు. ఈ వేడుకలను జూన్‌ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు.పూర్తి కథనం 

4. నాగ్‌పుర్‌లో 56 డిగ్రీలు నిజం కాదు.. వాతావరణ శాఖ స్పష్టత

దేశంలో వేసవి తీవ్రత (Heatwave) విపరీతంగా ఉంది. పలు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో గతంలో లేనంత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ (Nagpur)లో గల ఓ వాతావరణ స్టేషన్‌లో గురువారం ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించింది. దీంతో ప్రజలు హడలిపోయారు.పూర్తి కథనం 

5. పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది.. సుప్రీంను ఆశ్రయించిన బాధితుడు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు, పాల్వాయి గేటు తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ప్రాణహాని ఉందని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని అందులో కోరాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని వివరించాడు.పూర్తి కథనం 

6. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా దూరం: కాంగ్రెస్‌ వర్గాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ హాజరుకావడం లేదని సమాచారం. ఆరోగ్య సమస్యల వల్ల ఆమె రావడం లేదని నేతలకు సమాచారం అందింది. తీవ్రమైన ఎండల వల్ల సోనియా గాంధీ రాలేకపోవచ్చని పీసీసీ వర్గాలు తెలిపాయి.పూర్తి కథనం 

7. వారు తిరస్కరణ మోడ్‌లో ఉన్నారు: భాజపా

ఎగ్జిట్ పోల్స్(Exit Polls) అంచనాలపై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ (Congress) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసందే. దీనిపై భాజపా(BJP) స్పందించింది. జూన్‌ 4న కూడా ఆ పార్టీ నేతలు తమ బంకర్లలో ఉండటం మంచిదని ఎద్దేవా చేసింది.పూర్తి కథనం 

8. కలుషిత నీటితో 9కి చేరిన మృతుల సంఖ్య

నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం అదుపులోకి రాలేదు. అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మొగల్రాజుపురంలో గల్లా కోటేశ్వరరావు(60) అనే వృద్ధుడు వాంతులు, విరేచనాలతో మృతి చెందాడు. ఇప్పటికే డయేరియా లక్షణాలతో మొగల్రాజపురం, పాయకాపురంలో ఎనిమిది మంది మృతి చెందారు.పూర్తి కథనం 

9. పాండ్య ‘బ్యాకప్‌’ పేసర్.. బౌలింగ్‌ కాంబినేషన్‌ అలా ఉంటే తిరుగుండదు: గావస్కర్

విండీస్ - అమెరికా సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇవాళే బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌ ఆడనుంది. జట్టు కూర్పుపై ఓ అవగాహన వచ్చేందుకు ఇదొక సదావకాశమని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) వ్యాఖ్యానించాడు.పూర్తి కథనం 

10. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

కౌంటింగ్‌ సిబ్బందికి మే 26 నాటికే శిక్షణ పూర్తయిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌రాస్‌ తెలిపారు. నిజాం కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్‌ ఉంటారని తెలిపారు.ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.పూర్తి కథనం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని