Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Jun 2023 13:05 IST

1. నోట్ల కట్టలతో భార్యాపిల్లల సెల్ఫీ.. చిక్కుల్లో పోలీసు

భార్యా, పిల్లల సెల్ఫీ కారణంగా ఓ పోలీసు అధికారి (Police Officer)పై బదిలీ వేటు పడింది. వారు తీసుకున్న ఫొటోలో రూ.500 నోట్ల కట్టలు ఉండటమే అందుకు కారణంగా నిలిచింది. ఈ ఫొటోలు వైరల్‌గా మారిన తక్షణమే ఆయన్ను మరో చోటుకు ట్రాన్స్‌ఫర్‌ చేయడమే గాక.. ఘటనపై దర్యాప్తు కూడా చేపట్టారు. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)కు చెందిన రమేశ్ చంద్ర సహానీ ఉన్నావ్‌లోని బెహ్తా ముజవార్‌ పోలీసు స్టేషన్‌లో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (SHO)గా విధులు నిర్వర్తిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి నేడే ఆఖరు.. లింక్‌ చేయకపోతే ఏమవుతుందంటే?

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న ప్రతి వ్యక్తీ.. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం దానికి ఆధార్‌ సంఖ్యను అనుసంధానం (PAN Aadhaar Link) చేయాల్సిందే. ఈ పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు నేటితో ముగియనుంది. జులై 1వ తేదీ నుంచి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మోదీపై పుతిన్‌ ప్రశంసలు.. గ్రేట్‌ ఫ్రెండ్‌ అంటూ పొగడ్త

భారత ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) విధానాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Russian President Vladimir Putin) ప్రశంసించారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘మేకిన్‌ ఇండియా’(Make in India) విధానాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్‌లో ఈ ఇనిషియేటివ్ సత్ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. ‘భారత్‌లోని మన స్నేహితులు, రష్యాకు గొప్ప స్నేహితుడు అయిన ప్రధాని మోదీ.. కొన్ని సంవత్సరాల క్రితం ‘మేకిన్‌ ఇండియా’ను తీసుకువచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మదనపల్లె మార్కెట్‌లో ‘టమాటా’ షాక్‌.. కిలో ధర ఎంతంటే?

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా టమాటా ధర భారీగా పెరుగుతూ వస్తోంది. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధర రికార్డు స్థాయిలో పలికింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అక్కడ కిలో రూ.124కి చేరింది. మార్కెట్‌కు సాధారణంగా 1500 టన్నులు టమాటా వచ్చేంది. గురువారం మాత్రం 750 టన్నులు మాత్రమే వచ్చింది. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నల్ల దుస్తులు వద్దు.. హాజరు తప్పనిసరి: మోదీ రాక వేళ కళాశాలల మార్గదర్శకాలు

ప్రధాని మోదీ(Modi) రాక వేళ ఎవరూ నలుపు రంగు దుస్తులు ధరించవద్దని దిల్లీ విశ్వవిద్యాలయం(Delhi University ) పరిధిలోని కళాశాలలు మార్గదర్శకాలు జారీ చేశాయి. విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని కళాశాలలు తమ నోటీసుల్లో పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సాహితీ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి!

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు.  రియాక్టర్‌ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ముగ్గురు పిల్లలతో సహా మిడ్‌ మానేరులో దూకి తల్లి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి మిడ్‌ మానేరు జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో నలుగురూ మృతిచెందారు. తల్లి రజిత, పిల్లలు అయాన్‌(7), అసరజా(5), ఉస్మాన్‌(14 నెలలు)గా పోలీసులు గుర్తించారు. రజిత స్వస్థలం వేములవాడ మండలం రుద్రంగి కాగా..  కొన్నేళ్ల క్రితం మహమ్మద్‌ అలీని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పాకిస్థాన్‌కు భారీ ఉపశమనం.. ఐఎంఎఫ్‌తో డీల్‌ ఓకే..!

తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌ (Pakistan)కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 3 బిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చేందుకు సిబ్బంది స్థాయిలో ఒప్పందం జరిగింది. దీనికి ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. దీనిని బోర్డు జులైలో పరిశీలించవచ్చని ఐఎంఎఫ్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి ఈ ఒప్పందం దాదాపు కొన్ని నెలలుగా ఎటువంటి పురోగతి లేకుండా ఉండిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వివేకా హత్య కేసు.. నిందితుల రిమాండ్‌ పొడిగింపు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. ఆరుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిల రిమాండ్‌ను జులై 14 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులను పోలీసులు ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా కోర్టు ఆరుగురు నిందితులకు రిమాండ్‌ పొడిగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ముందు పోలీసులు వెనుక అల్లరి మూకలు.. రణరంగం మధ్యలో కూర్చొని శాండ్‌విచ్‌ ఆరగింపు..!

పోలీసుల కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మరణం ఫ్రాన్స్‌ మొత్తాన్ని కల్లోలం చేస్తోంది. దాదాపు రెండు రోజులుగా దేశం మొత్తం ఆందోళనలు మిన్నంటాయి. పారిస్‌ శివార్లలోని డిఫెన్స్‌ డిస్ట్రిక్ట్‌ వద్ద నాంటెర్రే అనే ప్రదేశంలో నిన్న నిరసనకారులు.. పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ సమయంలో ఆందోళనకారులు అక్కడే ఉన్న సామగ్రికి నిప్పు పెట్టి.. భద్రతా దళాలపైకి గాజుసీసాలు, రాళ్ల వంటివి విసిరారు. అదే సమయంలో భద్రతా దళాలు కూడా ఓ భవనం వద్దకు చేరి ఆందోళనకారులను అదుపు చేసే యత్నాలు చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని