Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jul 2023 13:10 IST

1. ఆ 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలే: హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్‌ ప్రాంతాలేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆయా గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ పరిధిలోకి వస్తాయని హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మార్కాపురంలో రెండు పాఠశాలల విద్యార్థుల ధర్నా

పాఠశాలకు బస్సులు కేటాయించాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక కోర్టు కూడలిలో కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు, సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మోడల్‌ స్కూల్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు చేశారు. రెండు పాఠశాలలకు బస్సులు పూర్తిగా రద్దు చేస్తే విద్యార్థులు ఎలా వెళ్లాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బైడెన్‌ కార్యవర్గం దూకుడుకు అమెరికా న్యాయమూర్తి బ్రేకులు..!

సోషల్‌ మీడియాలో కంటెంట్‌ను నియంత్రించే అంశంపై చర్చించేందుకు అమెరికా (Biden) ప్రభుత్వం చేస్తున్న యత్నాలకు అక్కడి న్యాయస్థానం బ్రేకులు వేసింది. మంగళవారం జోబైడెన్‌ (Biden) కార్యవర్గం సభ్యులు, ఏజెన్సీలు ఈ అంశంపై సామాజిక మాధ్యమ కంపెనీల ప్రతినిధులతో భేటీకాకుండా చూడాలని లూసియాన, మిస్సోరిలోని రిపబ్లికన్‌ అటార్నీ జనరల్‌ న్యాయస్థాన్నాన్ని ఆశ్రయించారు. దీనికి స్పందిస్తూ ఫెడరల్‌ న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గతంలో ఏమన్నావో గుర్తుందా బెయిర్‌స్టో.. నెట్టింట ట్రోలింగ్‌!

క్రీడాస్ఫూర్తి గురించి తెగ బాధపడిపోతున్న ఇంగ్లాండ్‌ అభిమానులు, ఆటగాళ్లను టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పాత వీడియోలు వైరల్‌గా మారాయి. గతంలో బెయిర్‌స్టో (Jonny Bairstow) ఇదే తరహాలో ప్రత్యర్థి బ్యాటర్‌ను ఔట్‌ చేసిన వీడియోను తాజాగా షేర్‌ చేస్తూ ఆసీస్‌ అభిమానులు కౌంటర్‌ ఇచ్చారు. 2014లో కౌంటీ మ్యాచ్‌ సందర్భంగా నాటింగ్‌హామ్‌ బ్యాటర్ సమిత్ పటేల్‌ను యార్క్‌షైర్‌ తరఫున ఆడిన కీపర్‌ బెయిర్‌స్టో వేచి చూసి మరీ స్టంపౌట్‌ చేశాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈడీ అధికారాలను అదుపు చేయకపోతే.. సుప్రీంకోర్టులో హరీశ్‌ సాల్వే కీలక వ్యాఖ్యలు

మనీలాండరింగ్‌ కేసుల్లో దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అధికారులకు అసాధారణ అధికారాలు కట్టబెట్టారని సీనియర్‌ న్యాయవాది హరీశ్ సాల్వే అన్నారు. వాటిని అదుపుచేయకపోతే దేశంలో ఎవరికీ భద్రత ఉండదని వాదించారు. గురుగ్రామ్‌కు చెందిన ఎం3ఎం కంపెనీ మనీలాండరింగ్‌ కేసు (money laundering case)కు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కంపెనీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సాల్వే.. ఈడీ అధికారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఫుట్‌బాల్‌ టోర్నీలో ‘మణిపుర్‌’ వివాదం.. మైతేయ్‌ జెండాతో జేక్సన్‌ సింగ్‌

శాఫ్‌ (దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ SAFF) ఛాంపియన్‌షిప్‌లో భారత ఫుట్‌బాల్‌ జట్టు (Indian Football Team) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో కువైట్‌పై గెలిచి ఈ టోర్నీలో తొమ్మిదోసారి విజేతగా అవతరించింది. మ్యాచ్‌ అనంతరం భారత జట్టు మొత్తానికి మెడల్స్‌ అందించారు. అయితే, ఆ సమయంలో ఓ ఆటగాడు మణిపుర్‌ (Manipur)కు చెందిన ఓ వర్గ జెండాను చుట్టకుని పతకం స్వీకరించడం వివాదాస్పదంగా మారింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శరద్‌ పవార్‌ ఆశీస్సుల వల్లే.. ఎన్‌సీపీలో తిరుగుబాటు..!

మహారాష్ట్ర(Maharashtra)లో ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్(Sharad Pawar) పుణ్యమేనని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) అధినేత రాజ్‌ ఠాక్రే(Raj Thackeray) అన్నారు. మూడురోజుల క్రితం ఎన్‌సీపీ పార్టీ నిట్టనిలువునా చీలిపోవడాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అతివేగంతో వచ్చి ఢీకొన్న బైక్‌.. విద్యార్థినికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని మల్లికార్జున కాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌ అరెస్ట్

భాజపాకు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన హైదరాబాద్‌ నుంచి బయల్దేరి గజ్వేల్‌ వెళ్తుండగా హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద  పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రఘునందన్‌ను అల్వాల్‌ పీఎస్‌కు తరలించారు. ఇటీవల గజ్వేల్‌లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. శరద్‌జీపై గౌరవం ఉన్నా.. కాలం మారింది: ఎమ్మెల్యేలకు అజిత్‌ పవార్‌ ఫోన్‌

ఎన్‌సీపీ(NCP)లో తిరుగుబాటుతో శరద్‌ పవార్‌(Sharad Pawar), అజిత్‌ పవార్(Ajit Pawar) నేతృత్వంలోని రెండు వర్గాలు బుధవారం సమావేశం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో ఏ పక్షం బలం ఎంతో తేలనుంది. ఈ క్రమంలో ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవాలని.. అజిత్ శిబిరం ఎన్‌సీపీ ఎమ్మెల్యేలను కోరింది. ఈ కీలక సమావేశాలకు ముందే అజిత్ వర్గం ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిందని, తమతో చేతులు కలపాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ‘మాతో కలిసిరావడం వల్ల 2024 ఎన్నికల్లో మేలు జరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని