Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Jul 2023 13:04 IST

1. వాలంటీర్లపై వ్యాఖ్యలు.. పవన్‌ కల్యాణ్‌పై కేసు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదైంది. వాలంటీరు సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై సురేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఐపీసీ 153, 153ఏ, 505(2) సెక్షన్ల కింద పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ విద్యావ్యవస్థపై బొత్స కీలక వ్యాఖ్యలు

తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్‌ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి’’ అని వ్యాఖ్యానించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విశాఖలో వైకాపాకు గట్టి షాక్‌.. 

విశాఖపట్నం జిల్లాలో వైకాపాకు గట్టి షాక్‌ తగిలింది. వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పెందుర్తి టికెట్ విషయంలో గతకొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన.. వైకాపాను వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో రమేశ్‌బాబు మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాజేంద్రనగర్‌లో బాలుడి కిడ్నాప్‌ కలకలం!

హైదరాబాద్‌ నగర శివారు రాజేంద్రనగర్‌లోని బండ్లగూడలో బాలుడి అదృశ్యం కలకలం రేపింది. రాత్రి చిట్టీ డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన 12 ఏళ్ల సాయి చరణ్.. ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా.. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేజ్రీవాల్‌ ఇంటి సమీపంలోకి వరద నీరు

దిల్లీ (Delhi)లో యమునా నది (Yamun River) మహోగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో దిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. గురువారం ఉదయం 9 గంటల సమయానికి నది నీటి మట్టం 208.51 మీటర్లకు చేరింది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీలో ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్‌ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా (IIIT admissions results)ను గురువారం విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లో కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రైల్వే ప్లాట్‌ఫాంపై విన్యాసాలు.. యువకుడి అరెస్టు

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారేందుకు ఒక్కొక్కరిది ఒక్కో ప్రయత్నం. అయితే, అందులో కొన్ని ప్రమాదకరమైనవి.. ప్రజలకు ఇబ్బంది కలిగించేవి కూడా ఉంటాయి. ఇలాగే.. ఓ రైల్వేస్టేషన్‌లో జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు (Cartwheel) ప్రదర్శించిన యువకుడి వీడియో తాజాగా వైరల్‌(Viral Video)గా మారింది. అయితే, యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు (RPF) వెంటనే అతడిని అరెస్టు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎడతెరిపిలేని వర్షం.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. వర్షం కారణంగా పని ప్రాంతంలో యంత్రాలపై పనిచేయడం కష్టతరంగా మారింది. గనుల్లోని రోడ్లు బురదమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌ లేకపోతే.. భద్రతా మండలి పరిపూర్ణం కాదు: మోదీ

పేద దేశాల ఎదుగుదలకు భారత్‌ వేదిక లాంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ లేకుండా.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) పరిపూర్ణం కాదని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌ (France) పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ.. అంతకుముందు ప్రముఖ ఫ్రెంచ్‌ డెయిలీ లెస్‌ ఎకోస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రష్యా రక్షణ మంత్రిని విమర్శించాడని.. కమాండర్‌ డిస్మిస్‌!

రష్యాలో వాగ్నర్‌ గ్రూప్‌ తిరుగుబాటుకు ప్రధాన కారణాల్లో ఒకరైన రక్షణ మంత్రి సెర్గీ షోయిగుపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది.షోయిగు ద్రోహంపై సీనియర్‌ జనరల్‌ ఇవాన్‌ పొపోవ్‌ కొన్నాళ్ల క్రితం విమర్శలు గుప్పించగా.. తాజాగా అతడిని పదవి నుంచి తొలగించారు. షోయిగు నాయకత్వంలోని రక్షణ శాఖ సైనికులకు ఆయుధాలు, మందుగుండు ఇవ్వడం లేదనడమే అతడు చేసిన తప్పు. దీంతో ఇవాన్‌ను తొలగిస్తూ షోయిగు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు