Cartwheels: రైల్వే ప్లాట్‌ఫాంపై విన్యాసాలు.. యువకుడి అరెస్టు

రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు చేసిన ఓ యువకుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌లోని మాన్‌పుర్‌ జంక్షన్‌లో ఇది వెలుగుచూసింది.

Updated : 13 Jul 2023 14:48 IST

పట్నా: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారేందుకు ఒక్కొక్కరిది ఒక్కో ప్రయత్నం. అయితే, అందులో కొన్ని ప్రమాదకరమైనవి.. ప్రజలకు ఇబ్బంది కలిగించేవి కూడా ఉంటాయి. ఇలాగే.. ఓ రైల్వేస్టేషన్‌లో జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు (Cartwheel) ప్రదర్శించిన యువకుడి వీడియో తాజాగా వైరల్‌(Viral Video)గా మారింది. అయితే, యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు (RPF) వెంటనే అతడిని అరెస్టు చేశారు. సంబంధిత వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. బిహార్‌లోని మాన్‌పుర్‌ జంక్షన్‌ (Manpur Junction)లో ఈ ఘటన వెలుగుచూసింది.

ఇదీ చదవండి: ఒకే తేదీన 9 మంది పుట్టినరోజు.. ఆ కుటుంబానికి గిన్నిస్‌ రికార్డు

మరోవైపు.. యువకుడి అరెస్టుపై ఆన్‌లైన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అతడి ప్రవర్తనను వ్యతిరేకించినప్పటికీ.. అరెస్టు చేయడాన్ని తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేసి ఉండాల్సిందిగా అభిప్రాయపడ్డారు. అరెస్టు చేయడానికి బదులు.. స్టేషన్‌ పరిసరాల్లో సామాజిక సేవ చేయించడం వంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని మరొకరు స్పందించారు. మరికొందరు మాత్రం.. ఆర్పీఎఫ్‌ తీసుకున్న నిర్ణయం సరైందేనని తెలిపారు. రైల్వేస్టేషన్‌లు సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించినవిగా చెప్పారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు