Botsa: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడారు.

Updated : 13 Jul 2023 13:02 IST

విజయవాడ: తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడారు.‘‘ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్‌ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి’’ అని బొత్స వ్యాఖ్యానించారు. 

ఆ వ్యవస్థ ఎలా పుట్టిందో పవన్‌ తెలుసుకోవాలి

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. అతని వ్యాఖ్యలపై ఎవరూ పట్టించుకోకుంటేనే మంచిదన్నారు. పొద్దు పొద్దున్నే మాకెందుకీ రచ్చ?అంటూ అసహనం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు పవన్ తెలుసుకోవాలని బొత్స హితవుపలికారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థపై దుర్బుద్ధితో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని