Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Jul 2023 13:15 IST

1. విమానాశ్రయంలో 47 కొండచిలువల పట్టివేత..!

బంగారం, డ్రగ్స్‌ను అక్రమంగా తరలించడం చూస్తుంటాం. కానీ, ఓ ప్రయాణికుడు తనతో పాటు ఏకంగా కొండచిలువ (pythons)లను తీసుకువచ్చాడు. ఈ ఘటన తమిళనాడు (Tamil Nadu)లోని తిరుచ్చి (Trichy) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మలేషియా (Malaysia)లోని కౌలాలంపూర్‌కు చెందిన మహమ్మద్ మొయిదీన్ అనే వ్యక్తి తనతో పాటు 47 కొండచిలువలు, రెండు బల్లులను అక్రమంగా భారత్‌కు తీసుకువచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పెద్దాపురంలో తెదేపా-వైకాపా సవాళ్ల పర్వం..

కాకినాడ జిల్లా పెద్దాపురంలో తెదేపా, వైకాపా మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. గత వారం రోజులుగా తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైకాపా ఇన్‌ఛార్జ్‌ దవులూరి దొరబాబు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో లైడిటెక్టర్‌ పరీక్షకు తాను సిద్ధమని.. సోమవారం ఉదయం పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌కు రావాలని చినరాజప్పకు సవాల్‌ విసిరారు. తాను వచ్చేందుకు సిద్ధమని.. అక్కడే తేల్చుకుందామని చినరాజప్ప తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇక రష్యా భూభాగంలోనే యుద్ధం..: జెలెన్‌స్కీ

భవిష్యత్తులో యుద్ధ భూమి రష్యాలోకి మారుతుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) అన్నారు. రష్యా (Russai) రాజధాని మాస్కోలోని వినుకోవా అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా నిన్న డ్రోన్‌ దాడులు జరిగిన అనంతరం ఆయన స్పందించారు. రష్యా భూభాగంలో దాడులు ఇరు దేశాల మధ్య యుద్దంలో సహజమైన అనివార్య న్యాయ ప్రక్రియగా అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగన్‌ మాటలు విని అతిగా ప్రవర్తిస్తే.. వారికి శిక్షలు తప్పవు: బొండా ఉమా

వైకాపా ప్రభుత్వ అవినీతిని వెలికి తీసేవాళ్లను వేధించేందుకేనా సీఐడీ? అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తెలంగాణలోని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 68వ అంతస్తు నుంచి పడి సాహసికుడి మృతి..!

అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో నేర్పరిగా పేరున్న రెమీ లుసిడి (Remi Lucidi) ప్రమాదవశాత్తు మృతి చెందాడు.  30 ఏళ్ల ఈ ఫ్రాన్స్‌ సాహసికుడికి ప్రమాదాలతో చెలగాటమాడటం సరదా. తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెదేపా నిరసనలో ఉద్రిక్తత.. బీసీ నేతపై ఎస్సై పిడిగుద్దులు

నగరంలోని లాడ్జి సెంటర్‌లో తెదేపా బీసీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై తెదేపా నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో తెదేపా బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ యాదవ్‌పై ఎస్సై నాగరాజు పిడిగుద్దులతో దాడి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: కిషన్‌రెడ్డి

తెలంగాణలో వరదలతో జనం అల్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. విపత్తు వేళ ఆదుకునేందుకు రాష్ట్రం వద్ద రూ.900కోట్ల‌కుపైగా కేంద్రం డిపాజిట్లు ఉన్నాయని.. అయినా తాత్కాలిక సాయం కూడా అందించలేకపోయారని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీదేవిలు కిషన్‌రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రూ.21 లక్షల విలువైన టమాటా లారీ మాయం!

ప్రస్తుతం టమాటా (Tomatoes) ధర కొన్ని ప్రాంతాల్లో డబుల్‌ సెంచరీ కొట్టేసింది. దీంతో మధ్యతరగతి వినియోగదారులు వాటిని కొనేందుకు వెనకాడుతున్నారు. మరోవైపు టమాటా ధరల పెరుగుదల.. వాటిని పండించే రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో టమాటా దొంగతనాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రూ.21 లక్షల విలువైన 11 టన్నుల టమాటా లోడుతో బయలుదేరిన లారీ కనిపించకుండా పోయింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మహిళా ఎంపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన శివసేన ఎమ్మెల్యే..

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేదిపై .. శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్‌ శిర్సత్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  ఆదిత్య ఠాక్రే  ఆమె అందాన్ని చూసే రాజ్యసభలో స్ధానం ఇచ్చారని సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై  ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) స్పందిస్తూ.. ‘ నేను ఎలా ఉన్నానో .. ఎక్కడ ఉన్నానో మీలాంటి వారు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఛాలెంజ్‌లో అధిక నీరు తాగి.. ఆసుపత్రి పాలై..!

మితంగా తింటే ఔషధం.. అదే అమితంగా తీసుకుంటే విషంగా మారుతుందని నిపుణులు చెబుతుంటారు. ఇలా.. ఓ ఛాలెంజ్‌లో భాగంగా తాగాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో నీరు తాగడంతో ఆసుపత్రి పాలయ్యింది ఓ యువతి. ఇంతకీ ఏమిటీ ఛాలెంజ్‌..? కెనడాకు చెందిన మిచెల్ ఫెయిర్‌బర్న్ అనే యువతి ఒక టిక్‌టాకర్‌. ‘‘75 హార్డ్‌’’అనే ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ (Fitness Challenge)లో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు