Tomatoes: రూ.21 లక్షల విలువైన టమాటా లారీ మాయం!

11 టన్నుల టమాటా లోడ్‌తో కర్ణాటక (Karnataka) నుంచి రాజస్థాన్‌ (Rajasthan)కు బయల్దేరిన ఓ లారీ మాయమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Published : 31 Jul 2023 12:45 IST

కోలార్‌: ప్రస్తుతం టమాటా (Tomatoes) ధర కొన్ని ప్రాంతాల్లో డబుల్‌ సెంచరీ కొట్టేసింది. దీంతో మధ్యతరగతి వినియోగదారులు వాటిని కొనేందుకు వెనకాడుతున్నారు. మరోవైపు టమాటా ధరల పెరుగుదల.. వాటిని పండించే రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో టమాటా దొంగతనాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రూ.21 లక్షల విలువైన 11 టన్నుల టమాటా లోడుతో బయలుదేరిన లారీ కనిపించకుండా పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని భోపాల్‌(Bhopal)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహిళ ఎంపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన శివసేన ఎమ్మెల్యే..

కర్ణాటక (Karnataka)లోని కోలార్‌ (Kolar)లో ఉన్న ఎస్‌వీటీ ట్రేడర్స్ యజమాని మునిరెడ్డి దుకాణం నుంచి 11 టన్నుల టమాటా లోడుతో లారీ రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపుర్‌ (Jaipur)కు గురువారం బయల్దేరింది. శనివారం రాత్రి లారీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ టోల్‌ గేట్‌ దాటినట్లు మునిరెడ్డికి డ్రైవర్‌ సమాచారం అందించాడు. ఆదివారం ఉదయం లారీ ఎంత దూరం వెళ్లిందనే సమాచారం తెలుసుకునేందుకు మునిరెడ్డి డ్రైవర్‌కు ఫోన్ చేయగా.. నంబర్‌ అందుబాటులో లేదని వచ్చింది. లారీకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లోకేషన్‌ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనతో కోలార్‌ పోలీసులను ఆశ్రయించాడు. మునిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. లారీ ప్రమాదానికి గురైందా? లేక మొబైల్‌ నెట్‌వర్క్ సమస్య వల్ల డ్రైవర్‌ ఫోన్‌ కలవడం లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని