Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Aug 2023 13:15 IST

1. బొమ్మను తిరిగిచ్చేందుకు.. వేల మైళ్లు ప్రయాణించిన పైలట్‌..!

బొమ్మ (Doll)ను పొగొట్టుకుని బాధపడుతున్న చిన్నారి ముఖంలో చిరునవ్వు నింపాడు ఒక విమాన పైలట్‌ (pilot). బొమ్మను తిరిగి ఇచ్చేందుకు ఏకంగా 5,880 మైళ్లు ప్రయాణించాడు. అసలేం జరిగిందంటే.. టెక్సాస్‌ (Texas)కు చెందిన రూడీ డొమింగ్యూజ్ కుటుంబంతో సహా కొన్ని రోజుల క్రితం ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. అతడి తొమ్మిదేళ్ల కుమార్తె వాలెంటినా.. తనకు ఎంతో ఇష్టమైన బొమ్మ (బీట్రైస్)ను కూడా వెంట తీసుకువెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టయోటా తయారీ ప్లాంట్ల మూత.. నిలిచిపోయిన కార్ల ఉత్పత్తి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) జపాన్‌లోని తమ 14 తయారీ కేంద్రాలను మంగళవారం మూసివేసింది. విడిభాగాల ఆర్డర్లను పర్యవేక్షించే కంప్యూటర్‌ వ్యవస్థలో లోపం తలెత్తడమే అందుకు కారణమని కంపెనీ (Toyota) తెలిపింది. ప్రాథమిక పరిశీలన తర్వాత ఇది సైబర్‌ దాడి కాకపోవచ్చునని సంస్థ ఓ అంచనాకు వచ్చింది. అయితే, ఈ సాంకేతిక లోపానికి కారణమేంటనే విషయంపై విచారణ జరుపుతున్నామని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విశాఖ కంటైనర్‌ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ఆందోళన

నగరంలోని కంటైనర్‌ టెర్మినల్ (వీసీటీ) వద్ద మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. టెర్మినల్‌కు భూములు అప్పగించిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ధర్నాకు దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. 2002లో విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ఏర్పాటు సమయంలో ఒక్కో కుటుంబానికి 60 గజాల ఇంటి స్థలం, రూ.లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వివేక్‌.. నా పాటలు పాడొద్దు: గ్రామీ అవార్డు విజేత అభ్యంతరం

రిపబ్లికన్ల తరఫున అమెరికా (USA) అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy)పై గ్రామీ అవార్డు విజేత, ప్రముఖ ర్యాపర్‌ ఎమినెమ్‌ (Rap star Eminem) అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా తాను పాడిన పాటలను వివేక్‌ తన ప్రచారానికి వినియోగించుకోవడమే అందుక్కారణం. దీంతో తన మ్యూజిక్‌ను వాడుకోవద్దని ఎమినెమ్‌ కాస్త గట్టిగానే చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇందిరాగాంధీ చంద్రుడి వద్దకు చేరుకున్నప్పుడు..! మరోసారి తడబడిన మమత

పశ్చిమ్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(West Bengal CM Mamata Banerjee) మరోసారి తడబాటుకు గురయ్యారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చంద్రుడిపైకి వెళ్లారంటూ వ్యాఖ్యానించి నెట్టింట ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇటీవల భారత అంతరిక్ష సంస్థ(ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 విజయం గురించి వెల్లడిస్తూ.. ఆమె ఇదే తరహాలో మాట్లాడిన సంగతి తెలిసిందే.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇంటి పైకప్పు మీద భారీ కొండచిలువ.. వీడియో వైరల్‌

ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో చిన్న పాము కనిపిస్తేనే వణికిపోతాం. అలాంటిది భారీ కొండచిలువ (Python) వస్తే.. ఇంకేముంది తీవ్ర భయభ్రాంతులకు గురవుతాం. వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్‌ చేయడం లేదా ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందిస్తే.. వాటిని జాగ్రత్తగా పట్టుకుని అడవుల్లో విడిచిపెడుతుంటారు. కానీ.. ఆస్ట్రేలియాలో ఓ ఇంటి పైకప్పు మీద పాకుతున్న కొండచిలువను చూసి చుట్టుపక్కల వాళ్లు ఏమాత్రం భయపడకుండా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 25 ఏళ్లలోపు పెళ్లిచేసుకుంటే రివార్డ్.. వధువులకు చైనా ఆఫర్‌

చైనా(China)లో జననాల రేటు గణనీయంగా తగ్గుతుండటంతో స్థానిక యంత్రాంగాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. తాజాగా 25 లేదా అంతకంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే యువతులకు రివార్డు అందనుంది. జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్‌ కౌంటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (population drop) 140 కోట్లకు పైగా జనాభా కలిగిన చైనా(China) ప్రస్తుతం.. తగ్గిపోతున్న జననాల రేటు(birth rate)తో కలవరపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్పా ముసుగులో వ్యభిచారం.. ఐదుగురు విటుల అరెస్ట్‌

స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. స్పా సెంటర్లలో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్సై కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఈ ఘటన సోమవారం ఉదయం జరగగా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టామని.. రాత్రి 7 గంటలకు అది పేలుతుందంటూ సోమవారం ఉదయం 11.50 గంటలకు ఓ వ్యక్తి కంట్రోల్‌ రూమ్‌కు మెయిల్‌ పంపాడు. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇక చాలు.. ఆఫీసుకు రావాల్సిందే! ఉద్యోగులకు అమెజాన్‌ వార్నింగ్

కరోనా పరిస్థితుల కారణంగా కార్పొరేట్‌ సంస్థలు ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) చేసేందుకు అనుమతించాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వారు ఆఫీసులకు వచ్చి పనిచేయాలని సంస్థలు సూచిస్తున్నాయి. అయితే, కొన్ని సంస్థల ఉద్యోగులు మాత్రం కంపెనీ ఆదేశాలను ఖాతరు చేయడంలేదు. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు ఉద్యోగులకు అల్టిమేటం జారీచేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని