Viral Video: ఇంటి పైకప్పు మీద భారీ కొండచిలువ.. వీడియో వైరల్‌

ఆస్ట్రేలియాలో ఓ ఇంటి పైకప్పు మీద పాకుతున్న కొండచిలువ వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 

Updated : 29 Aug 2023 11:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో చిన్న పాము కనిపిస్తేనే వణికిపోతాం. అలాంటిది భారీ కొండచిలువ (Python) వస్తే.. ఇంకేముంది తీవ్ర భయభ్రాంతులకు గురవుతాం. వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్‌ చేయడం లేదా ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందిస్తే.. వాటిని జాగ్రత్తగా పట్టుకుని అడవుల్లో విడిచిపెడుతుంటారు. కానీ.. ఆస్ట్రేలియాలో ఓ ఇంటి పైకప్పు మీద పాకుతున్న కొండచిలువను చూసి చుట్టుపక్కల వాళ్లు ఏమాత్రం భయపడకుండా.. దాన్ని వీడియో తీశారు. దాదాపు 16 అడుగుల పొడవున్న ఆ భారీ కొండచిలువ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 

ఆస్ట్రేలియా (Australia)లోని క్వీన్స్‌ల్యాండ్ (Queensland) ప్రాంతంలో ఓ ఇంటి పైకప్పు మీద ఈ కొండచిలువను గుర్తించి ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. వారు దాన్ని పట్టుకుని దగ్గర్లో ఉన్న అడవిలో విడిచిపెట్టినట్లు స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. వీడియోలో కొండచిలువ ఇంటి పైకప్పు నుంచి పక్కనే ఉన్న చెట్ల మీదకు పాకేందుకు ప్రయత్నిస్తుండటం చూడొచ్చు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని