Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Aug 2023 13:19 IST

1. బైడెన్‌కు మతి భ్రమించింది.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..!

అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)పై  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌కి పూర్తిగా మతి భ్రమించిందని ట్రంప్‌ విమర్శించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అధ్యక్షుడు జో బైడెన్‌కు మతి భ్రమించిందని.. ఆయన చర్యల కారణంగా భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం సంభవించినా ఆశ్చర్యంలేదంటూ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ వ్యాప్తంగా తెదేపా ‘ఇసుక సత్యాగ్రహం’.. దేవినేని ఉమా సహా పలువురు ముఖ్య నేతల అరెస్ట్

వైకాపా నేతల అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు చేపట్టిన ‘ఇసుక సత్యాగ్రహం’ మూడో రోజుకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తెదేపా ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిరసన తెలుపుతున్న మరికొందరు నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వరంగల్‌లో రౌడీషీటర్‌ హత్య.. రాడ్లతో దాడి చేసి చంపేసిన యూపీ వాసులు

వరంగల్‌లోని శివనగర్‌లో రౌడీషీటర్‌ సయ్యద్‌ నజీర్ హత్యకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి దుండగులు కత్తులతో దారుణంగా హతమార్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సుమారు 11 మంది నజీర్‌ను చుట్టుముట్టి రాడ్లతో దాడి చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నెలకు రూ.150 చెల్లిస్తే.. కనీస నిల్వ అవసరం లేదు!

ఎలాంటి కనీస నిల్వ (Minimum Balance) ఉంచాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక పొదుపు ఖాతాను యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis Bank) అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం నెలకు రూ.150 రుసుమును చెల్లిస్తే సరిపోతుందని బ్యాంక్‌ తెలిపింది. ఏడాదికి ఒకేసారి రూ.1,650 చెల్లించే వీలూ ఉంది. ఈ ఖాతాను తీసుకున్న ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్‌ రుసుములు, ఇతర ఛార్జీలు ఉండవని బ్యాంక్‌ తెలిపింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రధానికి రాఖీ కట్టిన చిన్నారులు..!

స్కూల్‌ విద్యార్థినులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ రక్షా బంధన్‌ (Raksha Bandhan) వేడుకను చేసుకున్నారు. దిల్లీ పాఠశాలల విద్యార్థులు బుధవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ తమ అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పంచుకుంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అమ్మానాన్న చిరకాల కల నెరవేరింది.. థాంక్యూ మహీంద్రా సర్‌: ప్రజ్ఞానంద

చెస్‌ ప్రపంచకప్‌ (Chess Worldcup) ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచినా సరే.. తన ప్రతిభతో కోట్లాది మంది భారతీయుల మనసులు గెల్చుకున్నాడు చెన్నై చిన్నోడు ప్రజ్ఞానంద (Praggnanandhaa). అయితే ఫైనల్‌ పోరులో టైటిల్‌ చేజార్చుకున్నప్పటికీ.. అతడి తల్లిదండ్రుల చిరకాల కల మాత్రం నెరవేరిందట. దానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra)నే కారణమంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దారుణం.. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారం

నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని బండ్లగూడలోని ఓ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవ వధువు కళ్లకు బాబా గంతలు కట్టి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దిల్లీలో హైఅలర్ట్‌.. వంగినా, పరిగెత్తినా కెమెరాలు పట్టేస్తాయ్‌..!

దేశ రాజధాని దిల్లీ(Delhi)లో జరగనున్న జి-20 శిఖరాగ్ర సదస్సు(G20 Summit) కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచదేశాల అధినేతల మధ్య జరిగే ఈ భేటీ వేళ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించింది. వారి రక్షణ నిమిత్తం భద్రతా బలగాలతో పాటు సరికొత్త సాంకేతికతలను ఉపయోగిస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం: దంపతులు మృతి.. యువకుడికి తీవ్ర గాయాలు

చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గుడిపాల మండలంలోని 190 రామాపురం, సీకే పల్లిలో ముగ్గురిపై దాడి చేసింది. 190 రామాపురంలో దంపతులపై దాడి చేసి చంపేసింది. పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లిన దంపతులు వెంకటేశ్ (50), సెల్వి (48)పై దాడి చేయడంతో వారిద్దరూ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విషాదం.. గుండెపోటుతో అన్న మృతి.. మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో అకస్మాత్తుగా మృతిచెందిన అన్న మృతదేహానికి సోదరి రాఖీ కట్టింది. 
మండలంలోని ధూళికట్టకు చెందిన చౌదరి కనకయ్య అనే గుండెపోటుతో యువకుడు హఠాన్మరణం చెందాడు. దీంతో అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన అతడి సోదరి గౌరమ్మ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని