Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Sep 2023 13:13 IST

1. ఒకే టికెట్‌తో 56 రోజుల ప్రయాణం.. దీని గురించి తెలుసా?

నిత్యం లక్షల సంఖ్యలో ప్రజలు తమ గమ్యస్థానాన్ని చేరుకోవటానికి రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగడం అందుకు ఒక కారణం. అయితే పుణ్యస్థలాలు, ఉద్యోగం, వ్యాపారం అంటూ నెలలో వందల మైళ్ల దూరం ప్రయాణించే వారూ ఉంటారు. అలాంటి వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ఇండియన్‌ రైల్వే (Indian Railways) ప్రత్యేకమైన టికెట్లను అందిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఇండియా’ కూటమికి తొలి పరీక్ష.. 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్‌

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్‌ (Bypoll) మంగళవారం కొనసాగుతోంది. భాజపా (BJP)కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చిన 28 విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా (INDIA bloc)’ భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లోనూ సాధ్యమైనంతవరకు కలిసే పోరాడుతామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఉప ఎన్నికలు విపక్ష కూటమికి తొలి పరీక్షగా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దేశం పేరు ఇక ‘భారత్‌’? తీర్మానం చేసే యోచనలో కేంద్రం..!

మన దేశం పేరును ఆంగ్లంలోనూ ‘ఇండియా (India)’ నుంచి ‘భారత్‌ (Bharat)’గా మార్చనున్నారా? రాజ్యాంగాన్ని సవరించి తీర్మానం చేయనున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఇప్పుడు ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అసలేం జరిగిందంటే.. భారత్‌ అధ్యక్షతన ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. షార్ట్‌కట్‌ కోసం.. గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనానే తవ్వేసిన ఘనులు..!

గోడ అంటేనే.. అడ్డంకి.. అదే ఏకంగా 21,196 కిలోమీటర్ల గోడ ఉంటే.. అందుకే.. ఈ అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్లడమే కర్తవ్యం అనుకున్నారో ఏమో.. ఏకంగా చారిత్రక ‘గ్రేట్‌ వాల్‌’ (Great Wall)నే ఓ చోట తవ్వేశారు కొందరు ఘనులు. ఈ ఘటన చైనా(China)లోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రూ.10 కోట్లు అవసరం లేదు.. పది రూపాయల దువ్వెన చాలు..: ఉదయనిధి స్టాలిన్‌

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ స్వామీజీ ఉదయనిధిపై (Udhayanidhi Stalin) బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి (Sanatan Dharma ) వ్యతిరేకంగా వ్యాఖలు చేసిన ఉదయనిధి తలపై  రూ.10 కోట్ల రివార్డు ప్రకటించారు. ఆ పని ఎవరూ చేయడానికి ముందుకు రాకపోతే.. తానే చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విష్ణు ప్రకాశ్‌ లిస్టింగ్‌ అదుర్స్‌.. ఒక్కో లాట్‌పై రూ.9,600 లాభం!

ఇన్‌ఫ్రా కంపెనీ ‘విష్ణు ప్రకాశ్‌ ఆర్‌ పంగ్లియా లిమిటెడ్‌’ షేర్లు ఈరోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి (Vishnu Prakash R Punglia Limited Listing). ట్రేడింగ్‌ ఆరంభంలోనే షేర్లు అద్భుత ప్రదర్శన కనబర్చాయి. ఇష్యూ ధర రూ.99తో పోలిస్తే దాదాపు 67 శాతం లాభంతో నమోదు కావడం విశేషం. ఈ కంపెనీ ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, నిర్మాణం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 30ల్లో పదవీ విరమణ ప్రణాళిక.. ‘టూ ఎర్లీ’ అంటారా? ఇది చదవండి..

పదవీ విరమణ (Retirement) ప్రతి ఉద్యోగి జీవితంలో భాగం. పదవీ విరమణ అనంతరం ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పదవీ విరమణ అనంతర జీవితమూ సౌకర్యంగా ఉండాలని ఆశిస్తారు. కానీ దాని కోసం పొదుపు (Retirement plan) చేయడంలో మాత్రం అలస్యం చేస్తారు. 35-36 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంకా పదవీ విరమణకు చాలా సమయం ఉందిలే నిదానంగా పొదుపు చేయొచ్చని అనుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రపంచంతో పాటే భారత్‌లోనూ ఐఫోన్‌ 15 అన్‌బాక్స్‌?

ఐఫోన్‌ 15 (iPhone 15) విడుదల గురించి చాలా మంది ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దాదాపు నెల తర్వాత ఐఫోన్‌ భారత్‌కు వస్తుంటుంది. కానీ, ఈసారి ఆ గ్యాప్‌ను దాదాపు పూర్తిగా తగ్గించే ప్రయత్నాల్లో యాపిల్‌ ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇదే జరిగితే.. యావత్‌ ప్రపంచంతో పాటే భారత్‌ కూడా కొత్త ఐఫోన్‌ను అన్‌బాక్స్‌ చేయనుంది! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పంజాగుట్ట-కూకట్‌పల్లి మార్గంలో భారీగా వరద నీరు

నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పంజాగుట్ట నుంచి కూకట్‌పల్లి వెళ్లే వాహనదారులు అవస్థలు పడ్డారు. అమీర్‌పేటలోని మైత్రీవనం, మూసాపేట మెట్రోస్టేషన్‌ వద్ద రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరింది. ఎర్రగడ్డ ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యువతిపై ప్రేమోన్మాది దాడి.. బ్లేడ్‌తో గొంతుకోసి పరారీ

నగరంలోని శ్రీహరిపురంలో ఓ యువతిపై ప్రేమోన్మాది బ్లేడ్‌తో దాడి చేశాడు. నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న లతశ్రీ ఇంట్లోకి సోమవారం అర్ధరాత్రి చొరబడిన అదే ప్రాంతానికి చెందిన నేతేటి రామారావు బ్లేడ్‌తో యువతి గొంతుకోశాడు. గత కొంత కాలం నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో యువకుడు జులాయిగా తిరుగుతుండటంతో ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని