Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Sep 2023 13:17 IST

1. తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలోని తూర్పు, ఈశాన్య జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలు: ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కట్నం కోసం.. భార్యను బావిలో వేలాడదీసి..!

కాలం మారినా.. ఇంకా కొందరు కట్నం కోసం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి కట్నం (Dowry) కోసం తన భార్యను బావిలో వేలాడదీశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీముచ్‌ జిల్లాకు చెందిన  రాకేశ్‌ కిర్‌ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, కట్నం తీసుకురావాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏ పదాలు కించపరిచేలా ఉన్నాయో జగన్‌ను చెప్పమనండి: పోలీసులతో లోకేశ్‌ 

 కొంతమంది పోలీసుల తీరుతో ఆ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పరిధిలోని బేతపూడిలోని క్యాంప్‌సైట్‌కు వెళ్లిన పోలీసులతో లోకేశ్‌ మాట్లాడారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బ్రిటన్‌ రెండో అతిపెద్ద నగర పాలక సంస్థ దివాలా..!

ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో ఒకటైన బ్రిటన్‌ (Britain) ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా మంగళవారం బ్రిటన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హామ్‌ సిటీ కౌన్సిల్‌ (Birmingham city council) దివాలా తీసినట్లు ప్రకటించింది. దీని ఆదాయం సుమారు 4.3 బిలియన్‌ డాలర్లు. ఇది ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇప్పుడు దివాలా తీయడంతో..  అత్యవసరం కాని అన్ని ఖర్చులను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు

భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free trade agreement- FTA)పై బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు మేలు చేసేదైతేనే ఒప్పందానికి అంగీకరిస్తామని మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో తెలిపారు. భారత్‌లో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)కు సునాక్‌ రానున్న విషయం తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రధాని భద్రతా బృందం ఎస్పీజీ చీఫ్‌ కన్నుమూత

ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్ గ్రూప్‌ (SPG) డైరెక్టర్‌ అరుణ్ కుమార్‌ సిన్హా  (Arun Kumar Sinha) కన్నుమూశారు. 61 ఏళ్ల సిన్హా గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు సీనియర్‌ అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మూసీ నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం

మూసీ నదిలో మహిళ మృతదేహం కొట్టుకొచ్చిన ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మూసీ పరివాహక ప్రాంతంలో బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి  పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ మహిళను కవాడిగూడ డిఎస్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ భార్య లక్ష్మి(55)గా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 50 ఏళ్లలోపు వారిలో 79% పెరిగిన క్యాన్సర్‌ కొత్త కేసులు!

 క్యాన్సర్‌ (Cancer) కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం దీనిపై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 50 ఏళ్లలోపు వారిలో కొత్తగా క్యాన్సర్‌ (Cancer) బారిన పడిన వారి సంఖ్య 79 శాతం పెరిగిందని ప్రముఖ జర్నల్‌ బీఎంజే ఆంకాలజీ తెలిపింది. గత 30 ఏళ్లకు సంబంధించిన వివరాలను ఇది వెల్లడించింది. స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని జరిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆదోనిలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సందీప్‌ కుమార్‌ (32) బుధవారం ఉదయం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శివనారాయణ స్వామి, సీఐలు శ్రీనివాస్ నాయక్‌, విక్రమ సింహ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉగ్రసంస్థగా వాగ్నర్‌.. ప్రకటించనున్న బ్రిటన్‌..!

రష్యా ఆధీనంలో నడుస్తున్న కిరాయి సైన్యం వాగ్నర్‌ (Wagner) గ్రూప్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించే అంశాన్ని యూకే (UK) పరిశీలిస్తోంది. అదే జరిగితే యూకే (UK) చట్ట ప్రకారం వాగ్నర్‌లో చేరడం, దానికి మద్దతు ఇవ్వడం చట్ట విరుద్ధం అవుతుంది. అంతేకాదు.. పార్లమెంట్‌లో దీనికి ఆమోద ముద్ర పడితే బ్రిటన్‌ పరిధిలోని వాగ్నర్‌ ఆస్తులను సీజ్‌ చేయడానికి అవకాశం లభిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని