Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Jun 2023 17:19 IST

1. కొత్త సబ్‌ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం నోటిఫికేషన్‌

భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా చేపట్టేలా కొన్ని జిల్లాల్లో కొత్తగా సబ్‌ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్‌ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాష్ట్ర మంతటా ‘నీలోఫర్‌’లాంటి వైద్య సేవలు: మంత్రి హరీశ్‌రావు

నీలోఫర్‌ ఆసుపత్రిలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సంందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో శిశుమరణాలు పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగంలో రూ.2కోట్లతో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నన్నూ డ్రగ్స్‌ తీసుకోమన్నారు: యువ కథానాయకుడు నిఖిల్‌

మాదక ద్రవ్యాలకు అందరూ దూరంగా ఉండాలని, ఒకసారి వాటికి అలవాటు పడితే, ఇక మరణమేనని యువ కథానాయకుడు నిఖిల్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ కార్యక్రమంలో మరో నటుడు ప్రియదర్శితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ.. తనని కూడా చాలాసార్లు డ్రగ్స్‌ తీసుకోమని కొందరు అడిగారని అయితే, అలాంటి వాటికి తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆధార్‌- పాన్ లింక్‌ అవ్వడం లేదా? ఇదే కారణం కావొచ్చు!

ఆధార్‌-పాన్‌ (Adhaar-PAN) అనుసంధానానికి గడువు దగ్గర పడింది. జూన్‌ 30తో ఈ గడువు ముగియనుంది. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్‌ ఉన్న ప్రతి వ్యక్తీ దాన్ని ఆధార్‌తో జత చేయాల్సిందే. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించారు. ఇప్పుడైతే రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి ఆధార్‌-పాన్‌ లింక్‌ చేసుకునేందుకు నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. ఆ గడువు కూడా ముగిశాక పాన్‌ కార్డు చెల్లుబాటు కాదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీ టూర్‌.. భారత్‌లో పెట్టుబడులకు టెక్‌ కంపెనీల హామీ

అమెరికా ప్రసిద్ధ టెక్‌ కంపెనీలైన అమెజాన్‌ గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ఆయా సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టగా.. ఆ పెట్టుబడులను మరింత విస్తరించడంతో పాటు సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. ప్రధాని మోదీ  అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయా సంస్థలు భారత్‌లో పెట్టుబడులకు హామీ ఇచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పాస్‌పోర్ట్‌ సేవా దివస్‌ సందర్భంగా జై శంకర్‌ కీలక ప్రకటన

పాస్‌పోర్ట్‌ సేవా దివస్‌ (PassPort Seva Divas) సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ (Jaishankar) కీలక ప్రకటన చేశారు. త్వరలో రెండోదశ పాస్‌పోర్ట్‌ సేవా కార్యక్రమం (పీఎస్‌పీ-2.0) ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇందులో కొత్త పాస్‌పోర్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు, ఈ-పాస్‌పోర్ట్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు కూడా వీలుకల్పిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆర్డర్‌ చేసిన నాలుగేళ్లకు డెలివరీ!

ప్రస్తుత కాలంలో ఏ వస్తువునైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ (Online order) చేస్తే ఒకట్రెండు రోజుల్లోనే ఇంటికి చేరుతోంది. మరీ దూరమైతే వారం రోజుల్లో వస్తుంది. కానీ ఇక్కడో వ్యక్తికి తాను చేసిన ఆర్డర్‌ నాలుగేళ్ల తర్వాత డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని తాజాగా ట్విటర్‌లో పంచుకున్నాడు. దీంతో ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ఇది ప్రారంభం మాత్రమే.. రష్యాకు అతిపెద్ద భద్రతా సవాల్‌..!’

రష్యా (Russia)పై ‘వాగ్నర్‌’ కిరాయి సైన్యం సాయుధ తిరుగుబాటు (Wagner Mutiny) ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు చర్యలు తీసుకుంటామని వాగ్నర్‌ చీఫ్‌ యెవ్జెనీ ప్రిగోజిన్‌ (Yevgeny Prigozhin) హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) ఇప్పటికే దీన్ని తీవ్రంగా ఖండించారు. వెన్నుపోటు చర్యగా అభివర్ణిస్తూ.. తమ ప్రజలను కాపాడుకునేందుకు ద్రోహులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దేశాన్ని రక్షించుకోవడానికి ఏమైనా చేస్తా: వాగ్నర్‌ తిరుగుబాటు నేపథ్యంలో పుతిన్‌ వ్యాఖ్య

వ్యక్తిగత లబ్ధి కోసం వాగ్నర్ గ్రూప్‌ అధిపతి రష్యాకు ద్రోహం చేస్తున్నాడని అధ్యక్షుడు పుతిన్‌(Russia President Vladimir Putin) తీవ్రంగా మండిపడ్డారు. ఈ సమయంలో దేశ ప్రజలను రక్షించుకునేందుకు తాను ఏమైనా చేస్తానని హెచ్చరించారు. వాగ్నర్ గ్రూప్‌ తిరుగుబాటు నేపథ్యంలో.. దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రష్యాను ఉలిక్కిపడేలా చేశాడు.. ఎవరీ ప్రిగోజిన్‌!

ఉక్రెయిన్‌ (Ukraine)పై సైనిక చర్యలో భాగంగా ఇన్నాళ్లు రష్యా (Russia) బలగాలకు అండగా ఉన్న వాగ్నర్‌ గ్రూప్ (Wagner group).. తిరుగుబావుటా ఎగరేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. పుతిన్‌ (Putin) సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వాగ్నర్‌ కిరాయి సైన్యం చీఫ్‌ యెవ్జెనీ ప్రిగోజిన్‌ (Yevgeny Prigozhin) హెచ్చరించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని