Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 30 Apr 2023 17:10 IST

1. తెలంగాణ మొత్తం కూలగొట్టి కడతారా అని హేళన చేశారు: సీఎం కేసీఆర్‌

నూతన సచివాలయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. సచివాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. గాంధీ మార్గంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని.. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందరికీ జోహార్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మహారాష్ట్రను వణికిస్తున్న ‘కొడవలి గ్యాంగ్‌లు’..!

మహారాష్ట్రలో ‘కొడవలి గ్యాంగ్‌’లు భీతావహ వాతావరణం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పుణె, పరిసర ప్రాంతాల్లో వేట కొడవళ్లతో జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా పింప్రీ- చించ్‌వడ్‌లో ఓ ‘కొడవలి ముఠా’ హల్‌చల్‌ చేసింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో స్థానికంగా ఓ మందుల దుకాణంలో ప్రవేశించి.. అక్కడున్న సిబ్బందిపై దాడికి దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కర్ణాటక ఎన్నికల్లో కరెన్సీ కుప్పలు..!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ కర్ణాటకలో ధన ప్రభావం తీవ్రంగా పెరిగిపోతోంది. ఇప్పటికే శనివారం నాటికి ఆ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రూ.302 కోట్ల విలువైన నగదు, వస్తువులు స్వాధీనం చేసుకొన్నారు. 2018 ఎన్నికలకు 10 రోజుల ముందు వరకు స్వాధీనం చేసుకొన్న రూ.115.91 కోట్ల కంటే ఇది రెండున్నర రెట్లు అధికం. గత నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే ఈ పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పవర్‌ప్లేలో పవర్‌ ఎవరిది..? దంచికొట్టిన జట్లు ఇవే..

ఐపీఎల్‌(IPL)లో పరుగుల సునామీ కొనసాగుతోంది. బ్యాటర్లు వీరవిహారం చేస్తుండటంతో ఈ సీజన్‌లో 200+ స్కోర్లు అలవోకగా నమోదవుతున్నాయి. ఇక ఈ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డును శుక్రవారం లఖ్‌నవూ(257) జట్టు తృటిలో చేజార్చుకుంది. అయితే.. ఈ భారీ స్కోర్లకు బాటలు వేస్తోంది పవర్‌ప్లేనే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎయిరిండియా సీఈఓకు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు

ఎయిరిండియా విమానంలో ఓ పైలట్‌ తన స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించిన ఘటనను పౌర విమానయాన నియంత్రణ సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశాన్ని నివేదించడంలో జాప్యం జరిగిందంటూ ఎయిరిండియా సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎయిరిండియా భద్రత, రక్షణ- నాణ్యత విభాగాధిపతికి సైతం నోటీసులు జారీ చేసినట్లు డీజీసీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సామాన్యులకు సంబంధించి వేల సందేశాలు చదివా.. 100వ మన్‌ కీ బాత్‌లో మోదీ

సామాన్యులతో అనుసంధానానికి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం వేదికైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల్లోని భావోద్వేగాలను తెలుసుకునేందుకు అవకాశం లభించిందన్నారు. తన ఆలోచనలను ప్రజలతో పంచుకోగలిగానని తెలిపారు. మనసులో మాట పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్‌ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్‌కీ బాత్‌’ వందో ఎపిసోడ్‌ ఆదివారం ప్రసారమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మాల్దీవులకు భారత్‌ కానుకలు..!

పొరుగు దేశమైన మాల్దీవుల(Maldives)తో బంధాన్ని పెంపొందించుకొనే దిశగా భారత్‌(India) చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో ఆ దేశానికి గస్తీ నౌక, ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ను బహూకరించనుంది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రిత్వశాఖ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాజ్‌నాథ్‌ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘రష్యా చేతిలో బందీ కావడం’ తీవ్ర అవమానకరమే..!

సైనిక చర్య పేరుతో రష్యా మొదలుపెట్టిన దురాక్రమణతో ఉక్రెయిన్‌ మొత్తం నాశనమైంది! వేల మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు కొన్ని నగరాలు, పట్టణాలు నామరూపాల్లేకుండా పోయాయి. అయినప్పటికీ.. ఉక్రెయిన్‌ మాత్రం ఏడాదికిపైగా తన ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన నాటి పరిస్థితులను గుర్తుచేసిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అప్పట్లో తాను తుపాకీ పట్టుకొని తిరిగానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రెజ్లర్లు ఇక ఆటపై దృష్టిపెట్టాలి: యోగేశ్వర్‌ దత్‌

బ్రిజ్‌ భూషణ్‌(Brij Bhushan Sharan Singh)పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో ఇక రెజ్లర్లు ఆట సాధనపై దృష్టి పెట్టాలని ఒలింపిక్‌ పతక విజేత యోగేశ్వర్‌ దత్‌(Yogeshwar Dutt) సూచించారు. బ్రిజ్‌ భూషణ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విచారణకు ఒలింపిక్‌ సంఘం నియమించిన ఏడుగురు సభ్యుల కమిటీలో దత్‌ కూడా ఒకరు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ సినిమా తీయాలంటూ రాజమౌళిని కోరిన ఆనంద్‌ మహీంద్రా.. !

టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన ప్రతిభపై సినీ ప్రముఖులే కాదు.. ఇతర రంగాల్లో వారూ ప్రశంసలు కురిపిస్తారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రాకు రాజమౌళికి మధ్య ట్విటర్‌లో జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సింధూ నాగరికతపై సినిమా తీయాలని కోరుతూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. దీనికి రాజమౌళి రిప్లై ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని