Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 07 May 2023 20:58 IST

1. ఆ విషయాన్ని ప్రియాంకా గాంధీ తెలుసుకుంటారు: మంత్రి కేటీఆర్‌

కాలంలో రాష్ట్రం ఇవ్వక.. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు కాంగ్రెస్‌ తరఫున ప్రియాంకా గాంధీ క్షమాపణ చెప్పాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. యువ సంఘర్షణ సభ పేరుతో తెలంగాణకు వస్తున్న ప్రియాంకా గాంధీ పర్యటనపై ఆయన స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆందోళన వద్దు.. మణిపుర్‌ నుంచి విద్యార్థులను తీసుకొస్తాం: బొత్స

మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుతున్న ఏపీకి చెందిన నిట్‌, ఐఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులందరినీ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాంగ్రెస్‌లో ఓటమి భయం.. అందుకే సోనియాగాంధీని ప్రచారానికి పిలిచారు!: మోదీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారం చివరిదశకు చేరుకున్న వేళ ప్రధాని మోదీ (PM modi) కాంగ్రెస్‌పై విమర్శల దాడిని పెంచారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే.. ఎప్పుడో ప్రచారానికి దూరమైన వ్యక్తిని తీసుకొచ్చారని ఎద్దేవాచేశారు. సోనియా గాంధీ పేరును ప్రస్తావించకుండా శివమొగ్గలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్‌ను దూషించడం వల్ల దేశం పురోగమిస్తుందా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ప్రచారం తుదిదశకు చేరుకుంటోంది. ప్రధాన పార్టీలైన భాజపా (BJP), కాంగ్రెస్ (Congress), జేడీఎస్‌ నేతలు ప్రత్యర్థులపై తమ విమర్శల్లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రచార పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విరుచుకుపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా: మాయావతి

కాన్షీరామ్‌ పోరాట మార్గంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని  బీఎస్పీ అధినేత్రి మాయావతి (mayawati) అన్నారు. బహుజన సమాజ్‌ పార్టీ (BSP) ఆధ్వర్యంలో ఆదివారం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘తెలంగాణ భరోసా సభ’కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల కోసం అంబేడ్కర్‌ రిజర్వేషన్లు తెచ్చినా.. ఇంకా ఆ వర్గాల చెంతకు అభివృధ్ధి చేరలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టాప్‌ లేపిన టైటాన్స్‌.. లఖ్‌నవూపై సూపర్‌ విక్టరీ

గుజరాత్ టైటాన్స్‌ మరోసారి అదరగొట్టింది. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేసింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (70; 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు),  కైల్ మేయర్స్‌ (48; 32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కేంద్రం కీలక నిర్ణయం.. రిపబ్లిక్‌ పరేడ్‌లో క్వైట్‌ ఛేంజ్‌!

కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకల (Republic Day) పరేడ్‌లో ఈసారి అందరూ మహిళలే కనిపించనున్నారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. దీనికి సంబంధించి ఇప్పటికే  కేంద్ర హోం మంత్రిత్వశాఖ, సాంస్కృతిక, పట్టణాభివృద్ధి శాఖలకు అంతర్గత సమాచారం అందినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం.. కేసు నమోదు చేసిన ఈడీ

ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం (Liquor Scam) వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌ ద్వారా నిందితులు సుమారు రూ. 2 వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) తెలిపింది. ఈ కుంభకోణం వెనుక రాయ్‌పూర్‌ మేయర్‌ ఏజాజ్‌ దేభర్‌ సోదరుడు అన్వర్‌ దేభర్‌ ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో అమ్ముడయ్యే ప్రతి మద్యం సీసా నుంచి అన్వర్‌ చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేసినట్లు ఈడీ ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మంచం కిందే మృతదేహం.. హోటల్‌లో పర్యాటకుడికి భయానక అనుభవం!

ఓ పర్యాటకుడి (Traveller)కి భయానక అనుభవం ఎదురైంది. టూర్‌ క్రమంలో ఓ హోటల్‌లో గది తీసుకున్న అతను.. అక్కడ దుర్వాసన వస్తోందంటూ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. తీరా.. అతని మంచం కిందే ఓ మృతదేహాన్ని గుర్తించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. టిబెట్‌ (Tibet)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. చైనా (China)కు చెందిన ఓ పేరొందిన ట్రావెలర్‌.. పర్యాటక ప్రాంతాలు చుట్టేస్తూ టిబెట్‌కు చేరుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. క్రిష్‌ ‘నో హిట్’ శర్మ వ్యాఖ్యలకు ఆకాశ్ చోప్రా కౌంటర్!

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని