Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 17 Jun 2023 21:07 IST

1. పరకాలలో పోటీచేసేందుకు ప్రతిపక్ష నాయకులకు భయం: మంత్రి కేటీఆర్‌

ప్రజల ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఎన్నికల్లో జయభేరి మోగించి హ్యాట్రిక్‌ సాధిస్తారని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నవంబర్‌.. డిసెంబర్‌లలో ఎన్నికలొస్తాయని, ఇది పక్కాగా జరుగుతుందని చెప్పారు. కారుకూతలు కూసే వారందరికీ ఇది తెలుసని స్పష్టం చేశారు. వరంగల్‌ జిల్లా పరకాలలో పోటీచేసేందుకు ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చాట్‌ జీపీటీ, ఏఐ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలి: చంద్రబాబు

టెక్నాలజీ, పాలసీలు సమర్థంగా అమలు చేయడం ద్వారా పేదరికంలేని సమాజాం సాధ్యమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. గ్లోబల్‌ ఫోరమ్‌ ఫర్‌ సస్టైనబుల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ) ఆధ్వర్యంలో ‘డీప్‌టెక్నాలజీస్‌’ అనే అంశంపై జరిగిన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ ద్వారా సమాజంలో సమూల మార్పులు తేవచ్చని, అదే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పూరీ రథయాత్రకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త. పూరీ యాత్రీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూన్‌ 18 నుంచి 22 మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్‌, కాచిగూడ, నాందేడ్‌ నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం ఇప్పటికే ప్రారంభమైందని, ఏసీ, నాన్‌ ఏసీ సదుపాయం కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణకు ప్రత్యేకంగా ఏమిచ్చారో కిషన్‌రెడ్డి చెప్పాలి: హరీశ్‌రావు

తెలంగాణ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిరంతర సహకారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌పై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పిన అబద్ధాలనే కిషన్‌రెడ్డి రిపీట్‌ చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ఇచ్చే రుణాలు.. కేంద్రం ఖాతాలో వేసుకోవడం సిగ్గు చేటన్నారు. పన్నుల పంపిణీలో తెలంగాణ వాటా ఏటా తగ్గుతూ వస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పవన్‌ కల్యాణ్‌ చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్‌ కొనిస్తారులే..!: పేర్ని నాని

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రెండు చెప్పులూ పోయాయని ఆందోళన చెందుతున్నారని.. చెప్పులు పోయిన సంగతి 3రోజుల తర్వాత ఆయనకు గుర్తుకు వచ్చిందా అని మాజీమంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘‘చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్‌ కొనిస్తారు కానీ, ఆయన పార్టీకి గాజు గ్లాసు గుర్తు పోయింది.. ముందు దాన్ని వెతుక్కోమని చెప్పండి’’ అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పిడిగుద్దులు.. గాల్లోకి ఎగిరిన కుర్చీలు..యూత్‌ కాంగ్రెస్‌ సమావేశం రసాభాస

మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ సమావేశం రసాభాసగా మారింది. అందులోని రెండు వర్గాలకు చెందిన నేతలు పరస్పరం పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. కుర్చీలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ముంబయిలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌ అధ్యక్షతన యువ నేతలు సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సార్వత్రికంలో NDA ఓటమికి అఖిలేశ్‌ ఫార్ములా

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ఒకే తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఎన్డీయేను ఓడించేందుకు కొత్త ఫార్ములాను సూచించారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు కలిస్తే ఎన్డీయేను సులువుగా ఓడించొచ్చని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత దౌత్యకార్యాలయాలపై దాడుల కేసులు.. రంగంలోకి ‘ఎన్‌ఐఏ’!

ఖలిస్థాన్‌ (Khalistan) సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) అరెస్టుకు భారత్‌లో ముమ్మర యత్నాలు సాగుతున్న వేళ.. పలుదేశాల్లో ఖలిస్థాన్‌ అనుకూలురు దేశవ్యతిరేక చర్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. అమెరికా శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ (Indian Consulate)పై ఏకంగా దాడికే దిగారు. కెనడా (Canada)లోనూ దౌత్యకార్యాలయం వద్ద దుశ్చర్యలకు పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గ్రీన్‌ కార్డు అర్హత నిబంధనలను సరళీకరించిన అమెరికా

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు కొద్ది రోజుల ముందు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అక్కడ శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్‌ కార్డు (Green Card) అర్హత నిబంధనలను సరళతరం చేసింది.. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జీరో డౌన్‌పేమెంట్‌తో ఓలా విద్యుత్‌ స్కూటర్‌

ఫేమ్-2 సబ్సిడీలో కేంద్రం కోత పెట్టడంతో విద్యుత్‌ ద్విచక్ర వాహన ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఈవీల కొనుగోళ్లపై వినియోగదారుల నుంచి ఆసక్తి మందగించింది. సేల్స్‌పై ఈ ప్రభావం పడకుండా కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆకర్షణీయ వడ్డీ రేట్లకే ఫైనాన్సింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని