Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... 

Updated : 27 Aug 2023 09:19 IST

1. ‘చెత్త’ నిర్ణయం

నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత కోసం ప్రభుత్వం చేసిన ప్రయోగాలు అటకెక్కుతున్నాయి. చెత్త నుంచి ఎరువులు, విద్యుత్తు తయారు చేస్తామన్న జగన్‌ సర్కారు ప్రకటనలు ఆచరణలో విఫలమవుతున్నాయి. డంపింగ్‌ యార్డులే లేకుండా చేస్తామన్న హామీలు బుట్టదాఖలవుతున్నాయి. చెత్త నుంచి ఎరువుల తయారీ, విద్యుదుత్పత్తి కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతోంది. ఇళ్లు, దుకాణాల నుంచి రోజూ సేకరిస్తున్న చెత్తను మళ్లీ డంపింగ్‌ యార్డుల్లోనే వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రోదసిలోకి ఆడ రోబో

ఇస్రో చేపట్టనున్న మానవ సహిత స్పేస్‌ మిషన్‌ గగన్‌యాన్‌కు సన్నాహకంగా త్వరలో ఆడ రోబోను అంతరిక్షంలోకి పంపనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. ఆడ రోబో పేరు వ్యోమమిత్ర అని వెల్లడించారు. కొవిడ్‌  కారణంగా గగన్‌యాన్‌ ప్రాజెక్టు ఆలస్యమైందని తెలిపారు. అక్టోబరులో మొదటి ట్రయల్‌ మిషన్‌ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విధేయత ప్రకటిస్తారా.. జైల్లోకి వెళతారా!

నాయకుడు లేని వాగ్నర్‌ ముఠాను తన గుప్పిట్లోకి తెచ్చుకొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పావులు కదపడం ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం ఒక డిక్రీపై సంతకం చేశారు. దీని ప్రకారం.. ఉక్రెయిన్‌ ప్రత్యేక సైనిక చర్యలో పాలుపంచుకుంటున్న వాగ్నర్‌ కిరాయి సైనికులంతా.. రష్యాకు విధేయంగా ఉంటామని సంతకం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాసిక్యూషన్‌ ఎదుర్కొనే ప్రమాదం ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇకపై లేజర్‌ నెట్‌..!

మారుమూల ప్రాంతాలు లేదా పట్టణ ప్రాంతాల్లోని ఆకాశ హర్మ్యాల మధ్య ఇంటర్నెట్‌ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావటంలో టెలికాం కంపెనీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిగ్నల్స్‌ బలంగా లేకపోవడం ఎంతో ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశం. దీనికి తోడు తరచుగా భూగర్భ కేబుళ్లు తెగిపోవటం, అవి ఎక్కడ తెగిపోయాయో తెలుసుకొని సరిదిద్దటం పెద్ద సమస్య. ప్రస్తుత సమాజంలో పెట్రోలు, డీజిల్‌ కంటే డేటా ఎంతో విలువైనది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అంతా ‘సర్వే’శ్వరుడి చేతిలోనే!

 వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో భారాస సిట్టింగ్‌ అభ్యర్థులకు దీటైనా, బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. సెప్టెంబరు మొదటి వారంలో తొలి జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలు వేర్వేరుగా సర్వేలు చేయించాలని నిర్ణయించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఊ అన్నారో.. ఊడ్చేస్తారు!

ఆకర్షణీయ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తున్నాం.. మీ సిబిల్‌ స్కోర్‌ బాగుంది.. ఇప్పుడు మంచి ఆఫర్‌ ఉంది.. మీరు ఎలాంటి కాగితాలు సమర్పించాల్సిన పని లేదు. సరే అంటే రెండు నిమిషాల్లో నేరుగా మీ బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేస్తాం.. అని ఊరించే ప్రకటనలతో ఫోన్‌ కాల్స్‌తో మోసగాళ్లు వల వేస్తున్నారు. తక్కువ వడ్డీకే వస్తుంది కదాని చాలా మంది నమ్మి వలలో చిక్కుకుని ఎదురు డబ్బులు సమర్పించుకుని మోసపోతున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు

ప్రభుత్వ సర్వీసెస్‌లో విజయం సాధించడానికి ప్రతిభ కంటే ఓర్పు ముఖ్యం. ఎన్ని గంటలు చదివామన్నది కాదు... చదివింది ఎంతవరకు అవగాహన చేసుకున్నామనేది ప్రధానం. మంచి అలవాట్లు పెంపొందించుకుంటే అవి మనల్ని లక్ష్యం వైపు ప్రోత్సహించేలా చేస్తాయి... ఇవీ గ్రూప్‌-1 ఫలితాల్లో విజేతగా నిలిచి డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు ఎంపికైన రాజమహేంద్రవరానికి చెందిన సువర్ణ మాట. ఆమె గ్రూప్‌-1లో ఎలా విజయం సాధించారు? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తూచ్‌.. ఇదేం పరిహారం!

రైతులకు మేలు చేస్తామని.. తమది రైతు ప్రభుత్వమని చెప్పే పాలకులు తీరా ప్రకృతి విపత్తులతో వారు నష్టపోయినపుడు ఆదుకునే విషయంలో మొండి చేయి చూపుతున్నారు. గత నెలలో గోదావరి వరదలకు కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వేలాది ఎకరాల ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 1565 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు లెక్క తేల్చిన అధికారులు పరిహారానికి ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన ఎంతో తెలుసా రూ.2.95 కోట్లు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రైలు డ్రైవరు నెత్తిన పేలుడు పదార్థం!

రైల్వే బోర్డు తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో రైలు డ్రైవర్లు (లోకో పైలట్లు) పేలుడు పదార్థాలను తమ వెంట మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలాసోర్‌ రైలు ప్రమాదం అనంతరం రైల్వే శాఖ చేపడుతున్న మార్పుల్లో దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇంతకుముందు రైలు డ్రైవరుకు సంబంధించిన పెట్టెలో డిటోనేటర్లు (పేలుడు పర్థాలు) ఉండేవి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వచ్చే ఎన్నికల్లో మీకు నచ్చిన వారికి ఓటేసుకోండి..: మంత్రి ధర్మాన

‘నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీకు చెప్పేందుకు ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు ఎన్నికలు రావడం లేదు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోండి.. కానీ ఓటేసే ముందుకు ఆలోచించుకుని మంచి చేసేవారికి ఓటేయండి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని కత్తెరవీధిలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని