Top Ten News @ Election Special: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Nov 2023 09:22 IST

1. అభివృద్ధిని చూడండి... ఆశీర్వదించండి

‘మేం గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. సగం కాలిన కడుపులు, ఎమర్జెన్సీ.. కర్ఫ్యూలు.. ఎన్‌కౌంటర్లు.. రక్తపాతాలు.. కరెంటు కోతల వంటి వెతలతో నిత్యం ప్రజలు కన్నీళ్లు కార్చే ఆ రాజ్యాన్ని మనం మళ్లీ తెచ్చుకోవద్దు. తెలంగాణ సాధించి, ప్రగతి పథాన నిలబెట్టిన భారాసనే గెలిపించండి’ అని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తద్దినం భోజనానికి పిలిస్తే.. మీ ఇంట్లో ఎప్పటికీ భోజనం ఇలాగే ఉండాలన్నాడట ఒకడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏ కష్టమొచ్చినా నేను, ప్రియాంక వస్తాం

‘‘నేను, మా చెల్లి ప్రియాంక ఇద్దరమూ తెలంగాణ ప్రజలకు దిల్లీలో సైనికులం. మీకు ఏ అవసరమొచ్చినా ఆదేశాలివ్వండి.. వెంటనే ఇక్కడికొస్తాం. తెలంగాణ ప్రజలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది. మా కుటుంబానికి, ఇందిరా గాంధీకి అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా నిలిచారు. ఈ విషయాన్ని జీవితాంతం మరచిపోం. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఓటరు స్లిప్పు’ అందలేదా..ఇలా చేయండి

మరికొన్ని గంటల్లో ఎన్నికల పోలింగ్‌ జరగబోతుంది. ఈ సమయంలో కొందరికి ఓటర్లకు ‘స్లిప్పు’లు అందకపోయి ఉండొచ్చు. అలాంటి వారు ఇబ్బందులు పడి ఓటింగ్‌కు దూరంగా ఉండటం సబబు కాదు. అరచేతిలోనే సాంకేతిక విప్లవం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఓటు వివరాలు తెలుసుకోవడం చాలా సులభం. అందుకు రకరకాల మార్గాలను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఓటోపదేశం

4. జాతీయ, ప్రాంతీయ పార్టీలంటే..

ఎన్నికల ప్రచారంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలంటూ నేతలు చెబుతుంటారు.. కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలకు గుర్తింపు మంజూరు చేస్తుంది. ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ నాలుగు రాష్ట్రాల్లోని ఓట్లలో నాలుగు శాతం ఓట్లు వస్తే జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఒక పార్టీ ఒక ప్రాంతంలో(రాష్ట్రంలో) నాలుగు శాతం ఓట్లు వస్తే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చుక్కల పల్లకిలో.. ముక్కలు పళ్లెంలో..!

రాజధానికి ఆనుకొని ఉండి వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఓ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు ఓటుకు రూ. 2 వేలు చొప్పున సుమారు 1.50 లక్షల ఓట్లకు పంపిణీ పూర్తి చేశాయి. మరో ప్రధాన పార్టీ అభ్యర్థి రూ.వేయి చొప్పున లక్ష ఓట్లకు పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లున్న పురపాలికకు ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడు తన స్వగ్రామంలో అభ్యర్థి ఇచ్చిన రూ.2 వేలతో పాటూ ఇంటికి కిలో కోడి మాంసాన్ని సొంత ఖర్చులతో మంగళవారం పంపిణీ చేసినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఓటు అమ్ముకుంటే..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విషయంలో సామాజిక మాధ్యమాల్లో చైతన్యం చేసే సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటును కొనేందుకు వెనుకాడటం లేదు. పోటీ గట్టిగా ఉన్న చోట అధిక మొత్తంలో చెల్లించి ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఓటర్లకు నగదు ఇచ్చి గెలుస్తామన్న ధీమా కూడా కొందరు అభ్యర్థుల్లో లేకపోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఓ మండలం.. ఇద్దరు ఎమ్మెల్యేలు

వికారాబాద్‌ జిల్లాలో కొత్తగా ఏర్పడిన కోట్‌పల్లి మండలం రెండు నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది. ఈ లెక్కన ఈ మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నమాట. 2018లో కోట్‌పల్లిని మండలంగా ఏర్పాటుచేశారు. దీని పరిధిలోకి 18 గ్రామాలను చేర్చారు. వీటిలో లింగంపల్లి, అన్నాసాగర్‌, బుగ్గాపూరు, కోట్‌పల్లి, ఇందోల్‌, ఓగులాపూరు గ్రామ పంచాయతీలు తాండూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఆయా చోట్ల 5,500 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఏ రంగు దేనికంటే...

ఎన్నిక ఏదైనా పోలింగ్‌ సిబ్బంది వివిధ రంగుల ప్యాకెట్లు వినియోగిస్తుంటారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఫలానా రంగు ఫలానా.. ఫలానా పనికి, లేదా వస్తువులు, కాగితాలు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు. వీటిపై పోలింగ్‌ సిబ్బంది శిక్షణ తరగతుల్లో ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. ఒకటో ప్యాకెట్‌ (గులాబీ రంగు): పోల్‌ అయిన ఓట్ల వివరాలు(17సీ), ప్రిసైడింగ్‌ అధికారి నివేదిక మూడు భాగాలుగా ఉంటుంది. నమూనా పోలింగ్‌ స్లిప్పులు కలిగి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా..

9. నోట్ల చెట్లకు ఓట్లు కాస్తే..

కీడెంచి మేలెంచాలన్న నానుడి ఎన్నో సందర్భాల్లో పనికొస్తుంది. మనం అయిదేళ్ల కోసం ఎన్నుకునే అభ్యర్థి విషయంలోనూ బాగా ఆలోచించాలి. కానీ ప్రస్తుతం ‘నోటు’ చుట్టూనే ‘ఓటు’ తిరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఇది నిజంగా కీడు చేసే అంశమే.. గెలుపును ‘కొనుగోలు’ చేసిన నాయకుడు మనకు పనిచేస్తారా? అన్న విషయం చర్చకు రావాలి. మన వజ్రాయుధాన్ని అమ్మేయకుండా.. పనిచేసే వ్యక్తికి మద్దతుగా నిలిస్తే మేలు జరుగుతుందన్న సంగతి గుర్తెరగాలి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఓటెయ్యకుంటే ఓడిపోతాం!

ఓటు... ఇందులో అక్షరాలు రెండే అయినా... ప్రజాస్వామ్యంలో వాటి విలువ అమూల్యం. మెరుగైన పాలనకు బాటలు వేసేది... పౌరుల బంగారు భవితను నిర్దేశించేది ఓటే. వ్యవస్థలో మార్పునకు నాంది పలికేది... వ్యక్తి అస్తిత్వానికి గుర్తింపునిచ్చేదీ ఓటే. మనం ఒక్కరమే వేయకుంటే ఏమవుతుందిలే అనుకుంటే పొరపాటే. ఒక్క ఓటే ప్రభుత్వాలను మారుస్తుందన్న విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది. ఓటేయని పౌరులు వ్యవస్థలో అలుసైపోతారు. చివరికి ఓడిపోతారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని