Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 28 May 2024 09:00 IST

1. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..

దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో (Indigo) విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అరాచకాలకు అడ్డేది?

కృష్ణా జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేలతో పాటు వారి వారసుల అరాచకాలు గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగిపోయాయి. ప్రతిపక్ష పార్టీల్లో క్రియాశీలకంగా ఉండే నేతలు, కార్యకర్తలపై వరుస దాడులకు తెగబడుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ప్రధానంగా మచిలీపట్నం, పెనమలూరుల్లో పోలింగ్‌కు రెండు నెలల ముందు నుంచి వైకాపా యువ నేతల హల్చల్‌ శ్రుతిమించిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గన్నవరానికి భారీ విమానం రాక

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌బస్‌ 340 ఎయిర్‌క్రాఫ్ట్‌ మొదటి సారి వచ్చింది. హజ్‌ యాత్రికులను తీసుకెళ్లేందుకు లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం సోమవారం ఉదయం ఇక్కడికి చేరుకుంది. పెద్ద విమానానికి సెరిమోనియల్‌ వాటర్‌ కానన్‌ సలైట్‌తో విమానాశ్రయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మద్యం విక్రయం.. నగదు రహితం

మద్యం విక్రయాల్లో ‘నవ్విపోదురు గాక నాకేంటి?’ అన్న చందంగా ఉంది ప్రభుత్వ తీరు. నిన్నటి వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఫోన్‌-పే, గూగుల్‌-పేలతో వెళితే మద్యం అమ్మేవారు కాదు. నగదు రూపంలో చెల్లిస్తేనే మద్యం ఇచ్చేవారు. డిజిటల్‌ పేమెంట్లు జరపకుండా నగదును పక్కదారి పట్టిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించినా చీమ కుట్టినట్లైనా స్పందించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మీటరు గిర్రు గిర్రు..

వేసవి అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం ఆరు గంటలైనా వేడి గాలుల తీవ్రత తగ్గడం లేదు. ఈ ఏడాది జిల్లాలోని పలు మండలాల్లో అత్యధికంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాణిజ్య దుకాణాలు కూడా వ్యాపారాలు లేక ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వెలవెలబోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం వాయిదా

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదికగా మంగళవారం ఉదయం చేపట్టాల్సిన అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పల్నాడు.. వర్గపోరుతో వల్లకాడు.. దశాబ్దాలుగా కోలుకోని కుటుంబాలు

గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఆరాటం.. రాజకీయ నేతల స్వార్థం.. పల్నాడు పల్లెల్లో దశాబ్దాల కింద రగిల్చిన చిచ్చులో ఎన్నో కుటుంబాలు సమిధలైపోయాయి. గ్రామాల్లో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి జరిగిన గొడవల్లో పెద్దదిక్కును కోల్పోయి వితంతువులుగా మిగిలిపోయిన మహిళలు.. తండ్రి లేక తల్లి పడే కష్టంలో పాలుపంచుకుంటూ చదువుకు దూరమైన పిల్లలు పడిన అవస్థలు వర్ణనాతీతం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘పట్టా’తప్పిన డిగ్రీ చదువులు

 డిగ్రీ చదువు ‘పట్టా’ తప్పింది. ఇంటర్మీడియట్‌ ఫలితాలొచ్చి 45 రోజులు గడిచినా డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల కాలేదు. దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. శేషాచలానికి.. పెద్దపులి రానంటోందా?

భీతిగొలిపే ఆకారం.. పదునైన పంజాతో ఎంతపెద్ద జంతువునైనా క్షణాల్లో మట్టికరిపించే వన్యమృగం పెద్దపులి.. వందేళ్ల కిందట శేషాచలం అడవులను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పెద్దపులి మళ్లీ తన స్థావరంలోకి రానని మొండికేస్తోందా? నల్లమల అడవుల నుంచి శేషాచలం వైపునకు తిరిగి చూడనంటోందా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మార్ఫింగ్‌ బొమ్మలతో దారుణాలకు తెగింపు

మార్ఫింగ్‌ చిత్రాలను చూపించి, యువతులపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతున్న అర్జున్‌ అలియాస్‌ అరుణ్‌గౌడ మళలి, అతని బంధువు బాలచంద్రలను శిరసి గ్రామీణ ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. కొడుకు అకృత్యాలకు సహకరిస్తున్న అర్జున్‌ తల్లి నాగవేణి పోలీసులకు దొరక్కుండా పరారైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని