Andhra News: వైకుంఠం-2లోని భక్తులకు రేపు శ్రీవారి దర్శనం: తిరుమల తిరుపతి దేవస్థానం

శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు తిరుమలకు ఇవాళ భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు రోజుల తర్వాత టోకెన్ల పంపిణీ జరుగుతుండటంతో మూడు పంపిణీ కేంద్రాల వద్ద విపరీతమైన భక్తుల రద్దీ నెలకొని ఇవాళ ఉదయం తోపులాట చోటు చేసుకున్న విషయ...

Published : 12 Apr 2022 17:30 IST

తిరుమల: శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు మంగళవారం తిరుమలకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెండు రోజుల తర్వాత టోకెన్ల పంపిణీ జరుగుతుండటంతో మూడు పంపిణీ కేంద్రాల వద్ద భక్తుల రద్దీ నెలకొని తోపులాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఒక్క రోజు టోకెన్లు లేకున్నా భక్తులను తిరుమలకు అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉండటంతో వైకుంఠం-2 కంపార్ట్‌మెంట్లను తితిదే సిద్ధం చేస్తోంది. గత రెండేళ్లుగా వినియోగించని కంపార్టుమెంట్లను శుద్ధి చేయిస్తోంది. దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చే భక్తుల కోసం క్యూలైన్లను సిద్ధం చేస్తున్నారు. దర్శన టికెట్లు లేనివారిని లేపాక్షి నుంచి క్యూలైన్లలోకి అనుమతిస్తున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. వైకుంఠం-2లోని భక్తులకు బుధవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని తితిదే తెలిపింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజనం, తాగునీటి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. మరోవైపు లడ్డూ టోకెన్ల జారీకి కంప్యూటర్లను సైతం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని